News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Anantapur: అనంతపురంలో యువతి హత్య.. గర్భిణీగా తేల్చిన పోలీసులు, విచారణలో సంచలన విషయాలు

పోస్టు మార్టంలో చనిపోయిన యువతిని గర్బిణిగా గుర్తించిన పోలీసులు.. పెళ్ళి కాకుండానే గర్బిణీ అయిందని తేల్చారు. ఈ క్రమంలో కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపారు.

FOLLOW US: 
Share:

ప్రేమించాడు.. అన్ని చేశాడు.. చివరకు ముఖం చాటేశాడు. గర్బం దాల్చేసరికి అబార్షన్ చేయించుకోవాలని బలవంతం చేశాడు. ఆమె వినకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన ప్రియుడు దారుణంగా అంతమొందించాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలివీ..

అనంతపురం జిల్లా కంబదూరు మండలం దేవరమాను క్రాస్ తిమ్మాపురం రోడ్డులోని ఉప్పరోని గుట్ట పొదల్లో ఈ నెల 18న ఒక యువతి మృతదేహం లభించింది. ఆమెను కంబదూరుకు చెందిన నందిని(22)గా గుర్తించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.. కంబదూరు పోలీసులు. పోస్టు మార్టంలో చనిపోయిన యువతిని గర్బిణిగా గుర్తించిన పోలీసులు.. పెళ్ళి కాకుండానే గర్బిణీ అయిందని తేల్చారు. ఈ క్రమంలో కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపారు. 

ఆమె ఫోన్‌లో చివరిగా నరేష్ అనే యువకుడితో మాట్లాడినట్లుగా గుర్తించారు. కనగానిపల్లి మండలం భానుకోటకు చెందిన నరేష్ కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. పోలీసులు విచారణ సీరియస్‌గా సాగుతుందని, తనపైనే అనుమానం వచ్చిందని కచ్చితంగా తెలుసుకొన్నాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాకా కొద్దిరోజులు బంధువుల ఊరిలో తలదాచుకొన్నాడు. చివరకు తన తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలుసుకొన్న నరేష్ చివరకు తన గ్రామ వీఆర్వో వెంకటేష్  ద్వారా కంబదూరు పోలీసుల ముందు లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు వెల్లడించాడు. 

‘‘ఇద్దరం ప్రేమించుకొన్నాం. శారీరకంగా కలిశాం. ఆమె గర్భవతి అయ్యింది. దీంతో అనేకమార్లు అబార్షన్ చేయించుకోమని బతిమాలాను. కానీ వినలేదు.. పెళ్ళి చేసుకోమని సతాయించింది. ఇంకా సెటిల్ అవ్వలేదు.. పెళ్ళి చేసుకోలేను అని తేల్చిచెప్పినట్లు నిందితుడు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక నమ్మించి బయటకు తీసుకెళ్ళి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హత్య చేసినప్పటి నుంచి తాను చేసిన తప్పుకు దొరికిపోతానని తెలిసి తప్పించుకుతిరిగాడు నరేష్. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

Also Read: బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!

Also Read: Nellore Rains: దయచేసి నెల్లూరు వైపు రావొద్దు.. వచ్చి ఇబ్బందులు పడొద్దు.. అధికారుల సూచనలు

Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Dec 2021 11:29 AM (IST) Tags: Anantapur murder Man murders lover Lover murder in Anantapur kambadur mandal lover Frauds woman

ఇవి కూడా చూడండి

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య

Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి

టాప్ స్టోరీస్

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్

Jagan Case: కోడి కత్తి కేసులో జగన్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్