News
News
X

Srikakulam News: ఎస్సై పై గ్రామస్థుల మూక దాడి, ఎందుకంటే?

Srikakulam News: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రూరల్ ఎస్సై రామకృష్ణపై లొద్దపుట్టి గ్రామస్థులు దాడి చేశారు. తరచుగా తమ గ్రామస్థులనే మందలిస్తున్నారని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

FOLLOW US: 

Srikakulam News: శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టిలో దారుణం జరిగింది. మంచి మార్గంలో నడవాలని చెప్పడానికి వచ్చి ఓ పోలీసులు అధికారిపైనే దాడికి పాల్పడ్డారు గ్రామస్థులు. అయితే గత కొంత కాలంగా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావడంతో.. తరచుగా మందలించారు. తాజాగా లొద్ద పుట్టి గ్రామంలో దీపావళి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేందుకు సిబ్బందితో సహా ఎస్సై రామకృష్ణ గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే తరచుగా గ్రామంలో గొడవలు జరగుతున్నాని తెలసిందని.. ఈసారి దీపావళి పండుగలో మాత్రం ఎలాంటి వాగ్వాదాలు జరిగిన ఊరుకోమంటూ గ్రామస్థులను మందలించారు.

దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన గ్రామస్థులు.. ఒక్కసారిగా పోలీసులపై దాడి చేశారు. అనుకోని ఘటనతో పోలీసుల షాకయ్యారు. తేరుకునే లోపే గ్రామస్థులంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో.. తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే తరచుగా తమ గ్రామస్థులను మందలించడం వల్లే ఈ దాడికి పాల్పడినట్లు లొద్దపుట్టి వాసులు చెబుతున్నారు. 

అరెస్ట్ చేయడానికి వెళ్తే.. గొంతు కోశాడు..

సినిమాల్లో విలన్ ని అరెస్ట్ చేయడానికి డెన్ కి వెళ్లిన  పోలీసులపై విలన్ గ్యాంగ్ తిరగబడుతుంది. సరిగ్గా నెల్లూరులో కూడా అదే జరిగింది. ఓ కేసు విచారణలో భాగంగా అనుమానితుడ్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ పైనే హత్యాయత్నం జరిగింది. గొంతుకోసి నానా హంగామా సృష్టించాడు ఓ వ్యక్తి. చివరకు పోలీస్ కానిస్టేబుల్ తప్పించుకుని కొనఊపిరితో ఆస్పత్రిలో చేరాడు. జిల్లా ఎస్పీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రాజాని పరామర్శించి ధైర్యం చెప్పారు. డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో బాబులాల్ కైలాష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

News Reels

కొన్ని నెలల క్రితం నెల్లూరులో ఓ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంటిని, ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారుని గుర్తు తెలియని వ్యక్తి తగలబెట్టాడు. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కుటుంబ కలహాల వల్లే ఇంటిని, కారుని తగలబెట్టారని తెలిసింది.  బాబూలాల్ కైలాష్ అనే వ్యక్తి 20ఏళ్ల క్రితం తన ఇద్దరు తమ్ముళ్లతో కలసి రాజస్థాన్ నుంచి నెల్లూరుకి వచ్చి స్థిరపడ్డాడు. బంగారు వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత ఎవరి కుటుంబాలు వారు వేరుపడ్డారు. ఈ క్రమంలో బాబూలాల్ మద్యానికి బానిసయ్యాడు. భార్యా బిడ్డల్ని కూడా సరిగా చూసుకోలేదు. రాజస్థాన్ వెళ్లినప్పుడు అక్కడ సొంతింటిని కూడా తగలబెట్టాడని సమాచారం. ఏడాదిన్నర క్రితం భార్యపై కత్తితో దాడి చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బాబూలాల్ ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. అయితే అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలతో వారిపై కక్ష పెంచుకున్న బాబూలాల్ తమ్ముళ్ల ఇళ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టాడని అంటున్నారు.

ఈ కేసులో విచారణ సందర్భంగా బాబూలాల్ ఎక్కడున్నారో కనుక్కుని కానిస్టేబుల్ రాజా అతడి వద్దకు వెళ్లాడు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని తెలిసే సరికి బాబూలాల్ కానిస్టేబుల్ పై దాడి చేసి తప్పించుకోబోయాడు ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ గుడిసెను కూడా అతడు తగలబెట్టాడు. కానిస్టేబుల్ రక్త గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత పోలీస్ బలగాలు బాబూలాల్ ని అరెస్ట్ చేశాయి. నెల్లూరులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడి జరగడం సంచలనంగా మారింది. వెంటనే కానిస్టేబుల్ ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స మొదలు పెట్టారు. మెడపై గాయాలు కావడంతో అత్యవసర వైద్యం అందించారు. జిల్లా ఎస్పీ విజయరావు కానిస్టేబుల్ ని పరామర్శించారు. 

Published at : 24 Oct 2022 05:28 PM (IST) Tags: AP News AP Crime news Srikakulam News Villagers Attack on SI Villagers Attack on Police

సంబంధిత కథనాలు

Anantapur News : అనంతపురంలో శాంతించని తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన తోపుదుర్తి చందు

Anantapur News : అనంతపురంలో శాంతించని తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన తోపుదుర్తి చందు

Hyderabad News : హైదరాబాద్ లో భారీ మోసం - బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట రూ.200 కోట్లు టోకరా!

Hyderabad News : హైదరాబాద్ లో భారీ మోసం - బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట రూ.200 కోట్లు టోకరా!

Hyderabad News: కానిస్టేబుల్ కేటుగాడు- ఏడు ముఠాలకు హెడ్డు!

Hyderabad News: కానిస్టేబుల్ కేటుగాడు- ఏడు ముఠాలకు హెడ్డు!

Kona Seema District News: చర్చి కోసం కొట్టుకున్న పాస్టర్ల- మహిళపై కత్తితో దాడి!

Kona Seema District News: చర్చి కోసం కొట్టుకున్న పాస్టర్ల- మహిళపై కత్తితో దాడి!

Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!

Delhi Pandav Nagar Murder: దిల్లీలో మరో ఘోరం- భర్తను చంపి, శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య!

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల