Medchal News: చింతల్‌లో దారుణం - రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్, హత్య
Telangana News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కలకలం రేపింది. దుండగులు వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Realter Murder In Chintal: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల (Jeedimetla) పరిధిలో సోమవారం దారుణం జరిగింది. చింతల్ లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. ఈ నెల 24న చింతల్‌లో బిల్డర్ మధు అదృశ్యమయ్యారు. అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధును దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. దుండగులు బండరాయితో మోది కత్తితో పొడిచి హతమార్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన వారే హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయన దగ్గర ఉన్న రూ.5 లక్షల నగదు, విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అయ్యి ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read: Cyclone Remal: తెలుగు రాష్ట్రాల్లో రెమాల్ బీభత్సం, 24 గంటల్లో 15 మంది దుర్మరణం