Online Betting: ఫోన్‌లో ఈ పద్ధతిలో గేమ్స్ ఆడుతున్నారా? జాగ్రత్త.. ! ఇతనివి రూ.6.7 లక్షలు హాంఫట్
ఆన్ లైన్ గేమ్స్ తో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. బెట్టింగ్ యాప్ ద్వారా 6.7 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
ఆన్ లైన్ గేమ్స్‌తో వినోదమే కాదు, వాటితో విషాదం కూడా పొంచి ఉంటుంది. ఇప్పటి వరకూ వైట్ కాలర్ నేరాలను చాలానే చూసి ఉంటాం. కానీ రోజు రోజుకీ కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి గురించి పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కూడా ఫలితం ఉండటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు ఏకంగా 6 లక్షల 70 వేల రూపాయలు మోసపోయాడు. దీని గురించి పోలీసులు లోతుగా పరిశోధిస్తున్నారు.
ఆన్ లైన్ గేమ్స్‌తో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. బెట్టింగ్ యాప్ ద్వారా 6.7 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని అన్నమేడు గ్రామానికి చెందిన తుమ్మల ప్రసన్నకుమార్ అనే యువకుడు సైబర్ మోసానికి బలయ్యాడు. ప్రసన్న కుమార్ స్థానికంగా ఉన్న ఒక రైసు మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. బియ్యం వ్యాపారులంతా ఇతని బ్యాంకు ఖాతాకు ఫోన్ పే ద్వారా సొమ్ము చెల్లిస్తుంటారు. ఈ క్రమంలో ఇతని అకౌంట్ లో ఎప్పుడూ లక్షల రూపాయల నగదు ఉంటుంది.
Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
ప్రసన్నకుమార్ కి ఓ అలవాటు ఉంది. ఖాళీ టైమ్ లో ఫోన్ మొబైల్ గేమ్స్ ఆడుతుంటాడు. చిన్నగా అది వ్యసనంగా మారింది. ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ టైమ్ గడిపేవాడు ప్రసన్న కుమార్. ఈ క్రమంలో మొబైల్ గేమ్స్ ద్వారా వచ్చిన లింక్ ని క్లిక్ చేసి బెట్టింగ్ గేమ్స్‌లోకి వెల్లాడు. అక్కడినుంచి సైబర్ నేరగాళ్లు అతనితో నేరుగా ఫోన్ కాంటాక్ట్ లోకి వచ్చారు. బెట్టింగ్ పెడితే రెట్టింపు డబ్బు వస్తుందని ఊరించారు, మెల్లగా ఉచ్చులోకి దించారు.
Also Read: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?
ప్రసన్న కుమార్ కి ఫోన్ చేసి బెట్టింగ్ కోసం ముందుగా డబ్బు జమచేయాలని సూచించారు మోసగాళ్లు. వారి మాటలు నమ్మి అలాగే డబ్బు జమ చేశాడు. విడతలవారీగా 6.7 లక్షల రూపాయలు సమర్పించాడు. ఇక ప్రసన్న వద్ద డబ్బులు లేవు అని తెలుసుకున్న తర్వాత మెల్లగా ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. ఆన్ లైన్ గేమ్స్ లో, బెట్టింగ్ లో ఒక్కసారి కూడా ప్రసన్నకు లక్ తగల్లేదు. మరోవైపు ఫోన్ చేస్తే అవతలినుంచి సమాధానం లేదు. దీంతో మోసపోయిన ప్రసన్న కుమార్ చివరకు పోలీసుల్ని ఆశ్రయించాడు.
అసలేంటి కథ..?
ప్రసన్న సొంత డబ్బులు పోగొట్టుకోలేదు. తన అకౌంట్ లో బియ్యం వ్యాపారులు జమ చేసిన డబ్బుని పోగొట్టాడు. నిజంగానే ప్రసన్న సైబర్ మోసానికి బలయ్యాడా లేక, ఏదైనా కట్టుకథ అల్లాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఆన్ లైన్ గేమ్స్ ఎలా ఆడాడు, అతనికి వచ్చిన ఫోన్ నెంబర్లు ఎక్కడివి, ఎవరు చేశారు..? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
Also Read: వాషింగ్ మెషిన్‌లో ఇంటి తాళాలు.. అయినా దర్జాగా చోరీ చేసి, అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి