Liquor Shops: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..
మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం.. గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాది సందర్భంగా.. మద్యం విక్రయ వేళలు.. పొడిగించారు.
మందుబాబులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. మద్యం విక్రయ వేళలు పొడిగించినట్టు తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి. 31న రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్ల నిర్వహణకు అనుమతి ఉంటుంది.
మరోవైపు ఒమిక్రాన్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి క్రిస్మిస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం తెలిపింది. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది.
జనవరి 2 వరకూ ఆంక్షలు
ఒమిక్రాన్ విస్తరిస్తోన్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణచట్టం కింద ఆంక్షలు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించినట్లు పేర్కొంది. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున్న జనం హాజరయ్యే కార్యక్రమాలకు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం పాటించాలని కోరింది. ప్రతీ ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. కార్యక్రమాల ప్రవేశద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటుచేయాలని, వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు ఆంక్షల ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. సీఎస్ సోమేశ్ కుమార్ గతంలోనే ఈ ఉత్తర్వులు జారీ చేశారు.