By: ABP Desam | Updated at : 28 Dec 2021 01:52 PM (IST)
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సం
Congress 137th Foundation Day: బ్రిటీష్ బానిస సంకెళ్లనే బద్దలు కొట్టడమే ధ్యేయంగా.. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడమే లక్ష్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. 1885 డిసెంబర్ 28న ముంబైలోని తేజ్ పాల్ సంస్కృత కళాశాల గోకుల్ దాస్ భవనంలో కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. నేడు కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సం. స్వాతంత్య్ర సమరయోధులు గోపాలక్రుష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, దాదాభాయ్ నౌరోజీ, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి.. స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపించారు.
క్విట్ ఇండియా.. డూ ఆర్ డై..
‘బ్రిటీష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన క్విట్ ఇండియా ఉద్యం.. డూ ఆర్ డై నినాదాలు నినాదాలలు స్వాతంత్య్ర కాంక్షను రెట్టింపు చేశాయి. స్వాతంత్య్ర అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి భారత్‌ను గణతంత్ర రాజ్యంగా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఈ పార్టీ నుంచి ఎన్నికైన ప్రధానులు, కీలక నేతలు ఎంతో ముందుచూపుతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తూ సంస్థానాలను విలీనం చేశారు.
బ్రిటీష్ పాలకుల దోపిడీతో చితికిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేయాలన్న సంకల్పంతో ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టులు, ఉద్యోగ కల్పనలకు ఊతమిచ్చే భారీ, మౌలిక పరిశ్రమల ఏర్పాటు, బతుక్కు భరోసా ఇచ్చే లైఫ్ ఇన్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, వైద్యరంగం డెవలప్‌మెంట్ కోసం ఎయిమ్స్, సాంకేతిక విద్యకోసం ఐఐటీలు, వృత్తి విద్యల కోసం ఐఐఎం, అంతరిక్షంలో రాణించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.. ప్రజలకు అన్నం పెట్టుందుకోసం హరిత విప్లవం.. ఇలా ఎన్నో రంగాలలో దేశాన్ని ముందుకు నడిపిన పార్టీ కాంగ్రెస్. ఎన్నో అంశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టింది కాంగ్రెస్ పాలకుల దార్శనిక ఆలోచనలే.
తాత్కాలిక అవసరాల కోసం నేటి కేంద్ర ప్రభుత్వాలు అమ్ముకుంటున్న సంస్థలు, వ్యవస్థలు, పరిశ్రమలు.. సమాజ హితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవే. ప్రతి ప్రాంతం, ప్రతి రాష్ట్రం, ప్రతి భారతీయుడు బాగుండాలని తపించిన కాంగ్రెస్ పాలకులు అందుకు అనుగణంగానే చర్యలు చేపట్టారు. మతాలు, భాషలు, ప్రాంతాలు అన్న వ్యత్యాసాన్ని పక్కన పెట్టి వసుధైక కుటుంబ భావాన్ని ప్రజల్లో నింపి.. సర్వశ్రేయోదేశాన్ని నెలకొల్పింది. వెనుకబాటుతనం ఉన్న ప్రాంతాల డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక రాష్ట్రాల ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ.. తెలంగాణ ప్రజల పోరాటాన్ని గుర్తించి, ఇక్కడి సంపద ఇక్కడివారికి పంచాలని, డెవలప్‌మెంట్ జరగాలన్న ఆలోచనతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు.
తెలంగాణలోని దళిత, బడుగు, బలహీన, బహుజన, అణగారిన వర్గాల ప్రజలతో పాటు.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. సంపదను, వనరులను, రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుంటున్నారు. ఉద్యోగాలు కావాలని బిడ్డలు బలిదానాలు చేసుకుంటుంటే.. తన కుటుంబంలోని వారికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాడు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆత్మ బలిదానాలు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం.. తనకో ఫామ్ హౌస్, కుమారుడు కేటీఆర్‌కో ఫామ్ హౌస్, కూతురు, అల్లుడు, షడ్డకుడి కుమారుడు ఉండేందుకు రాజభవనాలు నిర్మించుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.
Also Read: YS Jagan: ప్రజల వద్దకే నేరుగా పథకాలు.. సీఎం జగన్ వెల్లడి, తాజాగా వారి అకౌంట్లలోకి 703 కోట్లు
Gold-Silver Price: గోల్డ్ కొనే ప్లాన్ ఉందా? నేటి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి
Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్
DGP Mahender Reddy: సామూహిక జాతీయ గీతాలాపన చేద్దామంటూ డీజీపీ పిలుపు!
Minister Srinivas Goud : విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయి, రాజీనామాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
Tiger Wandering: మళ్లీ కనిపించిన పులి, గజగజా వణికిపోతున్న ప్రజలు
Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు
Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!