Chittoor: భార్య గొంతు కోసేసిన భర్త.. కాపురానికి రాలేదనే ఆగ్రహంతో ఘాతుకం
పుట్టింటికి వెళ్లిన భార్యను తాను పిలిస్తే కాపురానికి రాలేదనే అక్కసుతో ఆగ్రహం పెంచుకున్న భర్త కత్తితో భార్య గొంతుకోసి పరారయ్యాడు.
చెప్పిన వెంటనే కాపురానికి రాలేదనే అక్కసుతో ఓ కిరాతక భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆ చిన్న కారణానికి కోపోద్రిక్తుడైపోయి సైకోలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య గొంతు కోసేశాడు. పెళ్లైన మూడేళ్లకే ఆమెపై విరక్తి పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పుట్టింటికి వెళ్లిన భార్యను తాను పిలిస్తే కాపురానికి రాలేదనే అక్కసుతో ఆగ్రహం పెంచుకున్న భర్త కత్తితో భార్య గొంతుకోసి పరారయ్యాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఉప్పర పల్లె పంచాయతీ పరిధిలోని మల్లోల పల్లె అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లోల పల్లెకు చెందిన భాగ్యశ్రీకి మూడేళ్ల క్రితం అదే జిల్లా పూతలపట్టు మండలం దొమ్మాల పల్లెకు చెందిన వెంకటాద్రి అనే యువకుడితో పెళ్లి జరిగింది. వీరికి 9 నెలల వయసు ఉన్న ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, కొంత కాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి.
Also Read: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు
ఈ క్రమంలో 3 రోజుల కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భాగ్యశ్రీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం అక్కడికి వచ్చిన వెంకటాద్రి.. తనతో పాటు రావాల్సిందిగా భార్యను కోరాడు. అయితే, అతని మాట వినని భార్య కొద్ది రోజుల తరువాత వస్తానని చెప్పింది. దీంతో వెంకటాద్రి చిన్నబుచ్చుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఉన్న భర్త.. ఆసుపత్రికి భార్యను తీసుకెళ్లి చూపిస్తానని చెపపి అతని బైక్‌పై ఆమెను తీసుకొని సోమలకు బయలుదేరాడు.
Also Read: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు
మార్గమధ్యలో అడుసుపల్లె పొలాల వద్ద వాహనం ఆపి భార్యను కత్తితో విచక్షణారహితంగా పోడిచాడు. అనంతరం ఆమె గొంతు కోశాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలోని రైతులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వివాహితను స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం పీలేరులోని ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది. సంఘటనా స్థలాన్ని సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్సై లక్మీకాంత్ తదితరులు పరిశీలించారు.
Also Read: న్యూడ్ కాల్స్ చేస్తే 25 వేల జీతం.. అలా చాట్ చేస్తే 15 వేలు.. ఆ జంట దందా బయటపడిందిలా
Also Read: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి