By: ABP Desam | Updated at : 19 Dec 2022 02:45 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ప్రియుడిపై బ్లేడుతో దాడి
Konaseema News : అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజక వర్గం తాటిపాకలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన యువతి...అతడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. గూడపల్లి గ్రామానికి చెందిన కటికిరెడ్డి కృష్ణ గణేష్ తాటిపాక చెందిన వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ రాత్రి సమయంలో తన భర్త ఇంటి వద్ద లేరని ప్రియుడిని ఇంటికి పిలించింది మహిళ. ఇంటికి వచ్చిన కృష్ణతో ఆమె గొడవకు దిగింది. ప్రియుడు కృష్ణకి ఆమెతో కాక మరి కొంతమంది మహిళలతో సంబంధం ఉందని అనుమానంతో బ్లేడుతో అతడిపై దాడి చేసింది. ఈ దాడిలో కృష్ణ మర్మాంగానికి గాయమైంది. బాధితుడు కృష్ణ అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిపై 326 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వలపు వల
అందం, అభినయంతో టిక్ టిక్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియోలు పెడుతుంది. ఫాలోవర్లను పెంచుకునేందుకు చేయాల్సిన అన్ని పనులు చేస్తుంది. దాదాపు నాలుగైదు అకౌంట్ల నుంచి వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. ఆమె అందం చూసి ముగ్ధులైన చాలా మంది మెసేజ్ లు చేసేవారు. దాంతో ఆమె నేరుగా కాకుండా వారికి పర్సనల్ గా మెసేజ్ లు చేసేది. ఫొటోలు పంపుతూ, వారిని పంపమంటూ ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో వలపు వల విసిరేది. చిక్కిన యువకుల వద్ద నుంచి డబ్బులు అవసరం ఉన్నాయి, బహుమతులు కావాలంటూ లక్షల్లో వసూలు చేసేది. అలా ఎనిమిది నెలల్లోనే దాదాపు 32 లక్షల వరకూ కాజేసింది.
కామెంట్స్ చేసేవారే వాళ్ల టార్గెట్
ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసేది. సినిమా పాటలు, డైలాగ్ లు ఇలా అన్నింటినీ అనుకరిస్తూ చేసి పోస్టు చేసేది. మొత్తం నాలుగు ఖాతాల ద్వారా ఆమె ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంది. వారంతా ఆమె అందాన్ని పొగుడుతూ, ప్రేమిస్తున్నామంటూ కామెంట్లు కూడా చేసేవారు. అయితే కృష్ణా జిల్లాకు చెందిన పరసా రవితేజతో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. కామెంట్లు పెట్టే వారికి తిరిగి వ్యక్తిగతంగా సందేశాలు పంపించేది. పెల్లి చేసుకుంటానంటూ నమ్మంచి డబ్బులు వసూలు చేసేది. ఇలా హైదరాబాద్ కు చెంది ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం తదితర కారణాలు చెప్పి 8 నెలల్లో రూ.31.66 లక్షలు వూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తనుశ్రీ, రవితేజలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి
Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి
Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్ బోల్తా పడి 20 మంది దుర్మరణం
Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?