Kamareddy News: బర్త్ డే రోజు అమ్మానాన్నని పిలిచిన కొడుకు, వాళ్లు రాలేదని సంచలన నిర్ణయం
బర్త్ డే నే డెత్ డే గా మారింది. పుట్టిన రోజులు వేడుకలకు తల్లిదండ్రులు రాలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది.
బర్త్ డే వేడుకలకు తల్లిదండ్రులను పిలిచినా రాకపోవడంతో మనస్థాపం చెంది కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గిద్ద గ్రామానికి చెందిన విజయ్ తన పుట్టినరోజు ఈ నెల 23వ తారీఖున గ్రామంలో నిర్వహించుకుంటున్న కామారెడ్డి లో ఉంటున్న తల్లిదండ్రులను రావాలని ఫోన్ చేసి ఆహ్వానించాడు. దీంతో బర్త్ డే వేడుకలకు తల్లిదండ్రులు రాకపోవడంతో అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన విజయ్. దీంతో విజయ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భార్య నందిని చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద, గ్రామంలో ఎంత వెతికిన విజయ్ ఆచూకీ లభించలేదు.
నిన్న సాయంత్రం గ్రామ శివారులోని ఓ బావిలో విజయ్ శవమై తేలాడు. విజయ్ పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడంతో భార్య నందిని కన్నీరు మున్నీరు అయింది. విజయ్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి స్థానిక రామారెడ్డి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. భార్య నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Rape on police: రసంలో మత్తు మందు కలిపి, మహిళా పోలీసుపై హోంగార్డు అత్యాచారం!
కామారెడ్డిలో మంకీపాక్స్ అనుమానిత కేసు
కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలకలం రేగింది. ఇంద్రానగర్ కాలనీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నెలలో కువైట్ నుంచి బాధితుడు వచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మంకీపాక్స్‌గా అనుమానించి బాధితుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో వ్యక్తి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు.
ఫీవర్ హాస్సిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘అనుమానితుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతని ఫ్యామిలీ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచాం. పేషెంట్‌లో నుంచి ఐదు రకాల వేర్వేరు శాంపిల్స్ తీసుకుని పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తున్నాం. మంగళవారం సాయంత్రం లోగా రిపోర్ట్ వస్తుంది’’ అని సూపరింటెండెంట్ చెప్పారు. అయితే, మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తితో పాటు అతనితో దగ్గరగా మెలిగిన మరో ఆరుగురిని కూడా హోం ఐసోలేషన్ లో ఉంచామని ఆర్ఎంవో శ్రీనివాస్ వెల్లడించారు.