By: ABP Desam | Updated at : 26 Jul 2022 12:18 PM (IST)
రసంలో మత్తు మందు కలిపి, మహిళా పోలీసుపై హోంగార్డు అత్యాచారం!
Rape on police: అదే డిపార్టుమెంట్ లో పని చేసే ఆ మహిళా పోలీసుకు రసంలో మత్తు మందు కలిపి ఇచ్చాడో హోంగార్డు. అది అన్నంలో కలుపుకొని తిన్న ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ముందుగా వేసిన పథకం ప్రకారం ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను అతడి మొబైల్ లో బంధించాడు. ఇక అప్పటి నుంచి ఆమెను తరచుగా వేధిస్తున్నాడు. న్యూడ్ కాల్స్ చేయాలంటూ, మళ్లీ మళ్లీ తనను కలవాలంటూ ఫోన్ లు చేస్తున్నాడు. 50 లక్షల రూపాయలు ఇస్తేనే ఆ వీడియో డిలీట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో జరిగింది.
మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ పైనే అత్యాచారం..
హైదరాబాద్ ఆర్టీఏలో పని చేస్తున్న మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ పై తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అదే డిపార్ట్ మెంట్ కు చెందిన హోమ్ గార్డు. ముందుగా రసంలో మత్తు మందు ఇచ్చి మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ పై అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు తీసిని వాటిని చూపిస్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా హోంగార్డు అరాచకం కొనసాగుతూనే ఉంది. విషయం డిపార్ట్ మెంట్ లో తెలిస్తే... తన పరువు పోతుందని ఆమె కూడా నోరు మొదపలేదు. అతడి బాధను తప్పించుకునేందుకు ఆమె అతడు అడిగినన్ని డబ్బులు ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా అతడి వేధింపులు మాత్రం తగ్గడం లేదు. ఇక తన తాహుతుకు మించిన డబ్బులు అడగడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వారి సహకారంతో.. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులపై అత్యాచారాలు.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా?
మహిళా పోలీసుపైనే ఇంతటి అఘాయిత్యం జరుగుతుంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని పోలీసులే భయపడుతున్నారు. అయితే భాధితురాలి ఫిర్యాదులో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. హోమ్ గార్డును అదుపులోకి తీసుకున్నారు. మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ పై నిజంగానే అత్యాచారం చేశాడా, ఎన్ని సార్లు చేశాడు, ఎంత డబ్బు తీసుకున్నాడు.. అనే అంశాలను గురించి విచారిస్తున్నారు.
ఇన్నాళ్లూ పోలీసులు ఏం చేశారు?
విషయం తెలుసుకున్న సామాన్య ప్రజలు... పోలీసుల పరిస్థితే ఇలా ఉంటే ఇంక మా పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా అధికారంలో ఉన్న పై అధికారిణిపై ఓ హోంగార్డు ఇంతటి అరాచకానికి పాల్పడడం నిజంగా దారుణం అని అన్నారు. డిపార్ట్ మెంట్ లోని వాళ్లు ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే.. మీరేం చేస్తున్నారంటూ పోలీసులను నిలదీశారు. అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత దెబ్బకు అక్కడ బీజేపీ అంతా ఖాళీ! 70కి పైగా రోడ్ షోలు, యాత్రలు
Revanth Reddy: ఈసారి కాంగ్రెస్ గెలుపే టార్గెట్! 63 నియోజకవర్గాలు, 87 సభల్లో రేవంత్ రెడ్డి ప్రచారం
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>