Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు, మరో ముగ్గురు నిందితులు అరెస్ట్!
Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారంలో కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Jubilee Hills Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను తమిళనాడు, కర్నాటకలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పార్టీ పేరుతో 17 ఏళ్ల బాలికపై కొందరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 28న రాత్రి ఓ పబ్‌కు వచ్చిన బాలిక కారులో అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులు పార్టీకి పిలిచారని బాధిత బాలిక పబ్‌కు వెళ్లింది. జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం ఘటనలో నిన్న ఒకరిని అరెస్టు చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు. పుప్పాలగూడ వాసి సాదుద్దీన్ మాలిక్(18)ను అరెస్టు చేశామన్నారు. మిగిలిన వారిని ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు ఫుర్ఖాన్ కు ఎటువంటి సంబంధంలేదన్నారు. అతడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. అలాగే ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం పైనా ఆధారాలు లేవన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టామని డీసీపీ అన్నారు. ఒకరి పేరు మాత్రమే బాధిత బాలిక చెప్పగలిగిందన్నారు. సీసీ ఫుటేజ్, టెక్నీకల్ ఆధారాలు సేకరించామన్నారు. బాలిక స్టేట్మెంట్ తర్వాత సెక్షన్ లు మార్చామన్నారు.
పోక్సో కేసు
జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పుప్పాలగూడ వాసి సాదుద్దీన్ మాలిక్(18)ను అరెస్టు చేశామని డీసీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. మిగిలిన నిందితుడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 31వ తేదీన బాలిక తండ్రి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. 28వ తేదీన జరిగిన పార్టీకి బాలిక వెళ్లింది. ఆ తర్వాత జరిగిన ఘటనలతో షాక్ లోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన తండ్రి పాపపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రోజు బాలికను భరోసా కేంద్రానికి తీసుకొచ్చి కౌన్సెలింగ్ చేసి వివరాలు సేకరించామన్నారు. భరోసా కేంద్రం అధికారులు ఇచ్చిన వివరాలతో అంతకు ముందు నమోదు చేసిన కేసుతో పాటు అత్యాచారం, పోక్సో చట్టం కింద సెక్షన్లు యాడ్ చేశామన్నారు.
ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు