Case against Venu Swamy : వేణు స్వామిపై కేసు నమోదుకు కోర్టు - పట్టువదలని జర్నలిస్ట్ మూర్తి వల్లే !
Venu Swamy : జాతకాలు చెప్పే స్వామిపై కేసు నమోదుకు హైదరాబాద్ కోర్టు ఆదేశించింది. ప్రజల్ని మోసం చేస్తున్నారని జర్నలిస్టు మూర్తి ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు.
Hydrabad court ordered to register a case against Venu Swamy : వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయనపైకేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు 17వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని ఓ ప్రముఖ టీవీ చానల్ లో పని చేసే జర్నలిస్టు మూర్తి ఈ పిటిషన్ దాఖుల చేశారు. వేణుస్వామి చేస్తున్న మోసాలను వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని ..తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు. మూర్తి వాదనలతో ఏకీభవించిన కోర్టు వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.
ఇటీవల తెలుగు సినీ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత వేణు స్వామి వారి జాతకం అంటూ వీడియో రిలీజ్ చేశారు. పెళ్లి చేసుకున్నా విడిపోతారని ఆయన జాతకం చెప్పారు. వేణు స్వామి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన జాతకం ఎలా ఉందో.. ఆయనకు తెలుసా అని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన గతంలో జాతకాల పేరుతో అనేక మందిని మోసం చేశారని.. నగ్నపూజలు చేయించారని కొన్ని ఆధారాలతో ప్ర ముఖ టీవీ చానల్‌లో జర్నలిస్టు మూర్తి బయట పెట్టారు.
జనసేనలోకి బాలినేని - ఇతర నేతలు వెళ్లకుండా వైసీపీ హైకమాండ్ జాగ్రత్తలు
అయితే తనను బెదిరించి తన వద్ద డబ్బులు వసూలు చేయడానికే ఈ కథనాలు వేస్తున్నారని.. తనను మూర్తి ఐదు కోట్లు అడిగారని వేణు స్వామితో పాటు ఆయన భార్య ఆరోపణలు చేశారు. ఆ సందర్భంగా ఓ ఆడియో టేపును వినిపించారు. అయితే ఇదంతా మూర్తి తనపై చేస్తున్న కుట్రగా భావించి అప్పట్నుంచి వేణు స్వామికి సంబంధించిన అనేక అంశాలు బహిర్గతం చేశారు. వారు బయట పెట్టినఆడియో టేప్ లో మాట్లాడుకున్న ్వారు కూడా వేణు స్వామి సన్నిహితులేనని ఫోటోలుబయట పెట్టారు.
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
అలాగే వేణు స్వామికి ఉన్న కోట్లాది ఆస్తులు ఓ యూపీకి చెందిన గ్యాంగ్ స్టర్ రాజకీయ నాయుకుడి బినామీ అని ఆరోపించారు. ఇలా వరసుగా ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులకూ పిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టునూ ఆశ్రయించారు. కోర్టు ద్వారా వేణు స్వామిపై కేసు నమోదు చేయిస్తున్నారు. ఆయన చేసిన మోసాలన్నింటికీ ఆధారాలను పోలీసులకు సమర్పించి జైలుకు పంపిస్తానని మూర్తి సవాల్ చేస్తున్నారు. తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని వేణు దంపతులను మూర్తి డిమాండ్ చేస్తున్నారు.