అన్వేషించండి

Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?

Nagari : నగరి నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతలపై బహిష్కరణ వేటు వేశారు. రోజాను బుజ్జగించి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకే ఇలా చేశారని భావిస్తున్నారు.

YSRCP key leaders were expelled In Nagari Constituency : వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి  ఆ పార్టీకి దూరంగా ఉన్న రోజాను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె ప్రధాన డిమాండ్ అయిన పార్టీ వ్యతిరేకుల్ని బహిష్కరించడం అనే షరతును అమలుచేశారు. ఎన్నికలకు ముందు రోజాకు వ్యతిరేకంగా ఉన్న జడ్పీటీసీలు.. ఎంపీటులు పార్టీ క్యాడర్ ఇతర పార్టీల్లో చేరిపోయారు. అయితే పార్టీ వీడకపోయినా .. రోజాకు వ్యతిరేకంగా పని చేశారు కేజే కుమార్, కేజే శాంతి. నగరిలో వీరు కీలక  నేతలుగా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా.. ఈడిక కార్పొరేషన్ చైర్మన్ గా ఈ దంపతులు పని చేశారు. రోజాతో వీరికి సరిపడలేదు. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ తాజాగా వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. 

రోజా తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. విజయ్ కొత్త పార్టీలో చేరి అక్కడే ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. రోజా తమిళ సినిమాల్లోనూ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భర్త తమిళ ఉద్యమకారుడిగా మారిన సినీ దర్శకుడు సెల్వమణి. ఈ గుర్తింపుతో అక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే  పరాయి రాష్ట్రంలో  మంత్రిగా చేసి.. తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్నసందేహం ఉంది. అదే  సమయంలో నగరిలో తన వ్యతిరేకులందర్నీ పార్టీ నుంచి బహిష్కరిస్తేనే తాను  పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని రోజా పార్టీ పెద్దలకు తేల్చి చెప్పినట్లుగా తెలస్తోంది. 

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు

ఇటీవల రోజా సైలెంట్ గా ఉంటున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లోనే మాట్లాడారు. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి  వైసీపీ అనే పేరు తీసేశారు. జగన్ బొమను కూడా తీసేశారు. దీంతో  వైసీపీ హైకమాండ్ పెద్దలు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా  నగరి నియోజకవర్గంలో మళ్లీ తాను పని చేసుకోవాలంటే తన వ్యతిరేక వర్గాన్ని ఏ మాత్రం ప్రోత్సహించకూడడదని వారిని పార్టీ నుంచి  సస్పెండ్ చేయాలని షరతు పెట్టారు. ఈ షరతుకు వైసీపీ హైకమాండ్ అంగీరించి.. వారిని బహిష్కరిస్తున్నట్లుగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి పేరుతో ఉత్తర్వులు  జారీ చేయించారు. 

ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్

నిజానికి వారు రాష్ట్ర స్థాయి నాయకులు. పార్టీలోనూ రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించారు. ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు నిర్వహించారు. వారిని బహిష్కరించాలంటే.. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేయాలి. అయితే జిల్లా అధ్యక్షుడితోనే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయించడం ఆసక్తికరంగా  మారింది. నిజానికి వీరు జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితులు. మాట వరుసకు సస్పెండ్ చేసినా..  తమకు ప్రోత్సాహం ఉంటుందని వారు నమ్ముతున్నారు.                      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget