By: ABP Desam | Updated at : 26 Nov 2022 12:56 PM (IST)
Edited By: jyothi
కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు!
Hyderabad Crime News: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాగేవాళ్లకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు, అయిన వాళ్లకు కూడా ఈ మద్యం ఎనలేని శోకాన్ని మిగిలుస్తుంది. రోజూ ఫుల్లుగా తాగి వచ్చి వేధిస్తుంటే.. కుటుంబ సభ్యులు నరకం చూస్తుంటారు. ఇలా నరకం అనుభవించి, అనుభవించీ తట్టుకోలేని ఓ ఇల్లాలు.. పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అది జీర్ణించుకోలేని తాగుబోతు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. అయితే మృతుడు గోపాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మద్యానికి బానిసయ్యాడు. రోజూ ఫుల్లుగా తాగి వచ్చి భార్యను వేధించేవాడు. నిన్న కూడా ఇదే విషయమై ఇద్దరి మద్య గొడవ జరిగింది. భర్త ఎంత చెప్పినా తీరు మార్చుకోవడం లేదని భార్య.. నిన్న రాత్రి పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఇళ్లొదిలి వెళ్లపోవడం తట్టుకోలేని భర్త గోపాల్ అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే విద్యార్థిని ఆత్మహత్య..
రోజురోజుకూ మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. అన్నా చెల్లెల్లు రోడ్డు మీద వెళ్తున్నా అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. భర్తకు భార్యపై, భార్యకు భర్తపై అనుమానాలు పెంచుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఙటనే జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. సమీప బంధవుతో దిగిన ఫొటోల కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అదేంటి ఫొటోల వల్ల ప్రాణాలు ఎలా పోయాయి అనుకుంటున్నారా.. ఓ అమ్మాయి సమీప బంధువుతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలు చూసిన ఆ అబ్బాయి స్నేహితులు వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. దీంతో అవమానం భరించలేని అమ్మాయి.. ఆత్మహత్యకు పాల్పడింది.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన 20 ఏళ్ల మేఘలత జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన 24 ఏళ్ల శివ కుమార్ ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో తెలియడంతో మేఘలతకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈనెల 6వ తేదీన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మేఘలత మానసిక క్షోభకు గురైన ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతే కాకుండా చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ కూడా రాసిది.
సూసైడ్ నోట్ లో ఏముందంటే..?
"నాన్నా.. నేను నీ కూతురిని. ప్రాణం పోయినా తప్పు చేయను. 2019లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన వారిని వదలకు. అమ్మను, చెల్లిని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో." అంటూ తండ్రికి లేఖ రాసింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !
Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
Turkey Earthquake: టర్కీ, సిరియాలో భారీ భూకంపం, 1300 మందికి పైగా మృతి - భారత్ ఆపన్న హస్తం !
TSRTC Bus Accident : ఛాతీలో నొప్పి బస్సులోంచి దూకేసిన డ్రైవర్, ఆర్టీసీ బస్సు బోల్తా
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!