Tamil Lawyer : ఆన్‌లైన్ వాదనలు మానేసి మహిళతో సరసాలు... హైకోర్టు లాయర్‌పై బ్యాన్ ! ఎక్కడో కాదు ...
తమిళనాడులో ఓ లాయర్‌ను ప్రాక్టీస్ చేయకుండా బ్యాన్ చేశారు. ఎందుకంటే వాదనలు వినిపించకుండా ఆయన ఆన్‌లైన్‌లో రొమాన్స్ ప్రాక్టీస్ చేశారు. న్యాయమూర్తుల్ని కించపరిచారు.
వర్క్ ఫ్రం హోం అంటే ఇంట్లోనే ఇంటిపని..వంట పని..వంటి పని చేసుకోవడం అనుకునే బ్యాచ్ ఎక్కువగానే ఉన్నారు. ఉద్యోగం కాకుండానే..ప్రొఫెషనల్ పని కూడా ఇంట్లో నుంచే చేస్తూ ఉండేవారిలోనూ ఇలాంటి వేషాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఓ కేసులో వర్చువల్ పద్దతిలో వాదనలు వినపించాల్సిన లాయర్.. న్యాయమూర్తుల ముందు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ టైంపాస్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Also Read: భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి.. రక్తదానమే గిఫ్ట్.. అవయవ దానమే ఆశీర్వాదం
తమిళనాడు హైకోర్టులో సంతాన కృష్ణన్ అనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు . ఆయనను నమ్ముకుని ఓ వ్యక్తి తన కేసు వాదించాలని మాట్లాడుకున్నారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ కేసు విచారణ హైకోర్టు ధర్మానసం ముందుకు వచ్చింది. లాయర్ సంతాన కృష్ణన్ వాదనలు వినపించేందుకు రెడీగా ఉన్నారు. అయితే మరో వైపు లాయర్ వాదనలు కొనసాగుతూండటంతో ఆ టైంలో ఏం చేద్దామా అని ఆలోచించాడు. ఆ వాదనలు వినడం కంటే... ముఖ్యమైనపని ఉందన్నట్లుగా మహిళను పిలిచి.. కమెరా ముందే సరసాలు ప్రారంభించాడు. అవి సరసాలు అనడం కంటే శృంగారం చేసేశాడు అనొచ్చు.. హైకోర్టు న్యాయమూర్తులు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా పనులు చేసేశాడు.
Also Read: 30ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న చర్చి... క్రిస్మస్ వేళ అరుదైన దృశ్యం...
లాయర్ చేసిన పనులు చూసి.. హైకోర్టు ధర్మాసనం షాక్‌కు గురైంది. జస్టిస్ ప్రకాశ్, జస్టిస్ హేమలతతో కూడిన ధర్మాసనం, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఐటీ చట్టం కింద అపరాధంగా పరిగణించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. లాయర్ సంతాన కృష్ణన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. ఈ మేరకు వెంటనే స్పందించిన తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిళ్లు.. ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయకుండా సంతాన కృష్ణన్‌పై నిషేధం విధించాయి.
ఆ లాయర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కాగా ఇంటర్నెట్ నుంచి వీడియోను తొలగించాలని ఆదేశించారు. లాయర్ వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్ అయింది. అంత బరి తెగింపు ఎందుకని... కెమెరా ఆన్‌లో ఉంటుందన్న స్పృహ కూడా ఉండదా అని చర్చోపచర్చలు నడుస్తున్నాయి.
Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి