By: Ram Manohar | Updated at : 19 May 2023 11:12 AM (IST)
గ్రేటర్ నోయిడాలోని ఓ యూనివర్సిటీలో ఓ విద్యార్థి తోటి స్టూడెంట్‌ని గన్‌తో కాల్చి చంపేశాడు.
Greater Noida:
నోయిడాలో ఘటన..
యూపీలోని నోయిడాలో యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హత్య జరగడం సంచలనం సృష్టిస్తోంది. సోషియాలజీ థర్డ్ ఇయర్ స్టూడెంట్ తన క్లాస్‌మేట్‌తో గొడవ పడ్డాడు. కాసేపటికే గన్ తీసి కాల్చి పారేశాడు. నోయిడాలోని శివ్ నాడార్ యూనివర్సిటీలో ఈ దారుణం జరిగింది. ఆ తరవాత నిందితుడు అనూజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లోని డైనింగ్ హాల్ బయట సీసీకెమెరాలో ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు. అనూజ్ ఓ అమ్మాయితో మాట్లాడుతూ కనిపించాడు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ తరవాత అనూజ్ ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు. ఇంతలోనే ఏమైందో...జేబులో నుంచి గన్ తీసి షూట్ చేశాడు. వెంటనే అలెర్ట్ అయిన యాజమాన్యం...ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తరలించింది. అయినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఆమెని షూట్ చేసిన వెంటనే హాస్టల్ రూమ్‌కి వెళ్లిపోయాడు అనూజ్. తనను తానే కాల్చుకుని చనిపోయాడు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులని, ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. కాసేపు వాగ్వాదం జరిగినందుకే హత్య చేసేంత వరకూ వచ్చిందా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ग्रेटर नोएडा शिव नादर यूनिवर्सिटी परिसर में छात्र द्वारा परिचित छात्रा को गोली मारने व बाद में खुद को भी गोली मारकर आत्महत्या करने की घटना के संबंध में @DCPGreaterNoida द्वारा दी गई बाइट। थाना-दादरी @Uppolice pic.twitter.com/sgIvXYJWN3
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 18, 2023
ఢిల్లీలోనూ దారుణం..
భార్యపై కసి పెంచుకున్నాడు. ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. తన వల్ల కాదని తెలిసి కిరాయి హంతకులను మాట్లాడుకున్నాడు. చివరకు పంతం నెగ్గించుకున్నాడు. ఢిల్లీలో జరిగిందీ దారుణం. 35 ఏళ్ల భార్యను 71 ఏళ్ల భర్త దారుణంగా చంపించాడు. వెస్ట్ ఢిల్లీ రాజౌరీ గార్డెన్లో ఈ హత్య జరిగింది. వెంటనే స్పాట్‌కి వెళ్లిన పోలీసులు..మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై కత్తి పోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే..విచారణ చేపట్టిన తరవాత అసలు డొంకంతా కదిలింది. గతేడాది నవంబర్‌లో ఎస్కే గుప్తతో ఆమెకు వివాహం అయినట్టు తేలింది. తన కొడుకుని చూసుకుంటుందన్న ఆశతోనే ఆమెను వివాహం చేసుకున్నాడు ఎస్కే గుప్త. కొడుకు దివ్యాంగుడు. కద్దలేని పరిస్థితుల్లో సేవలు చేయాల్సి వచ్చింది. కానీ...భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో గుప్త అసహనానికి గురయ్యాడు. డైవర్స్ కావాలని అడిగాడు. విడాకులివ్వాలంటే కోటి రూపాయల భరణం ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కి ఒప్పుకోని గుప్త..ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని చూశాడు. చంపేయాలని ప్లాన్ చేశాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. తన కొడుకుని తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తితోనే బేరం కుదుర్చుకున్నాడు. రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్‌గా రూ.2.40 లక్షలు ఇచ్చాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Odisha News: వ్యక్తిని హత్య చేసి 12 ముక్కలుగా నరికిన దుండగులు, ఆపై కవర్లో కుక్కి దారుణం
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!
Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !
Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!