Madan Lal Son : మాజీ ఎమ్మెల్యే కొడుకు ఐఏఎస్.. కానీ ఆయన చేసిన పనే కేస్ అయింది !
ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. కానీ అమ్మాయిని మోసం చేసిన కేసులో ఇరుక్కున్నారు.
తమిళనాడులోని మధురైలో ట్రైనీ కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి మృగేందర్ లాల్‌పై హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక అవసరాలు తీర్చుకున్నారని ఇప్పుడు వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యారని ఆ కేసు సారాంశం. ఆ ట్రైనీ ఐపీఎస్ మృగేందర్ లాల్ ఎవరో కాదు.. మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్ లాల్ కుమారుడు. మదన్ లాల్ టీఆర్ఎస్ నేత కావడంతో ఈ కేసు వ్యవహారం రచ్చ అవుతోంది.
మాజీ ఎమ్మెల్యే బానోత్ మధన్లాల్ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎర్లపూడి గ్రామానికి చెందినవారు. ఆయన కుమారుడు మృగేందర్ లాల్.. సివిల్స్ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఆ పేరు చెప్పి దూరపు బంధువులైన యువతితో పరిచయం పెంచుకున్నారు. కాబోయే కలెక్టర్‌నని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను పార్టీలకు తీసుకెళ్లారు. ఏడాదిపాటు సాగిన ప్రేమాయణం అనంతరం ఐఏఎస్ ట్రైనింగ్ కోసం వెళ్లాడు. ఏప్రిల్ 2021లో మృగేందర్ మధురై జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ప్రేమించిన అమ్మాయిని మాత్రం మర్చిపోయారు.
Also Read: దర్శకుడు శంకర్ అల్లుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిని..
తమిళనాడులో ట్రైనింగ్‌లో పరిచయమైన మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడన్న సమాచారం రావడంతో ఈ విషయం తెలిసిన సదరు యువతి మృగేందర్‌ను నిలదీసింది. దీంతో మృగేందర్‌తో పాటు అతడి తండ్రి మదన్ లాల్ సైతం యువతిపై బెదిరింపులకు దిగారని ఆమె ఆరోపిస్తోంది. బంధువైన ఓ పోలీస్ అధికారి సాయంతో యువతిపై తప్పుడు కేసులు బనాయించి.. ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్, ఐప్యాడ్ తీసుకుని సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపిస్తోంది.
Also Read : మోహన్‌బాబు అరెస్ట్‌కు రెండు రాష్ట్రాల్లో ఫిర్యాదులు ! ఎందుకంటే ?
యువతి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద మృగేందర్, అతడి తండ్రి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసి నెల రోజులకుపైనే అవుతోంది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ యువతి మీడియాకు సమాచారం ఇచ్చింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి