Mohan Babu : మోహన్‌బాబు అరెస్ట్‌కు రెండు రాష్ట్రాల్లో ఫిర్యాదులు ! ఎందుకంటే ?
మోహన్ బాబును అరెస్ట్ చేయాలని గొర్రెలు, మేకల పెంపకం దారులు డిమాండ్ చేస్తున్నారు. తమ మనోభావాలను కించ పరిచారని వారుపోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
సినీ నటుడు మోహన్‌బాబుకు పెద్ద చిక్కొచ్చి పడింది. మనోభావాలు దెబ్బతీశారని ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వివాదానికి కారణం "మా" ఎన్నికల హడావుడిలో ఆయన చేసిన ఓ వాఖ్య ఇప్పుడు దుమారం రేపుతోంది. . " సినిమా ఎన్నికల్లో ఏమిటీ గొడవలు.. ఏమిటి బీభత్సం.. ఏంటి ఘర్షణలు.. ప్రజలందరూ చూస్తున్నారు.. గొర్రెలు, మేకలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది.. అతను కూడా ఇక్కడ జరిగిందంతా చూస్తున్నాడు. అతనికి కూడా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందని.. " అని మోహన్ బాబు అన్నారు. ఇక్కడ గొర్రెలు, మేకలు మేపుకునే వారి ప్రస్తావన చులకనగా ఉండటంతో వారి మనోభావాలకు చిక్కొచ్చి పడింది.
Also Read : 'మా' అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. అదొక బాధ్యత.. మోహన్ బాబు లేఖ
ఈ వ్యాఖ్యలు తమ వృత్తిని అవమానించేలా ఉన్నాయని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం నేతలు ఎక్కడిక్కకడ ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో ఫిర్యాదులు ప్రారంభమైనా.. తెలంగాణలో మాత్రం జోరందుకున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో తమను కించపరిచేలా మాట్లాడిన సినీనటుడు మంచు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
తనపై గొర్రెలు, మేకల పెంపకం దారులు చేస్తున్న ఆరోపణలపై మోహన్ బాబు ఇంత వరకూ స్పందించలేదు. తన వ్యాఖ్యలు వివాదం రేపిన అంశం గురించి ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఇది వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. మోహన్ బాబు స్పందించి క్షమాపణలు చెప్పకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని అంటున్నారు. ఈ వివాదం మరింత పెద్దదవకుండా మోహన్ బాబు కూడా స్పందించే అవకాశం ఉందని.. ఆయన క్షమాపణలు చెప్పి వివాదాన్ని ముగిస్తారని భావిస్తున్నారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
"మా" ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్‌ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డిన మోహన్ బాబు ఇప్పుడు ప్రభుత్వాల మద్దతుతో ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండస్టీ తరపున ఇద్దరు ముఖ్యమంత్రులకు సన్మానం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి