అన్వేషించండి

Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం

Telangana News: తెలంగాణలో శని, ఆదివారాల్లో జరిగిన తీవ్ర విషాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా.. ఓ చోట ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకాడు.

Road Accidents In Telangana: తెలంగాణలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో చోట ఆర్థిక ఇబ్బందులతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు, రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేటలోని (Siddipet) వివేకానందనగర్ కాలనీకి చెందిన సత్యం (49) ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడు. పదేళ్ల క్రితం భార్య చనిపోగా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి కుమార్తె త్రివర్ణ హాసిని (5), కుమారుడు అన్వేష్ నందా (7). శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని చింతల్ చెరువులో సత్యం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు గాలించిన పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో తన సోదరుడికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చాడని.. అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యం గత కొన్ని రోజులుగా ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో..

ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల (Siricilla) పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 37వ వార్డు మైసమ్మపల్లికి చెందిన బైరి అమర్ (45), స్రవంతి (40) దంపతులు తమ పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. అమర్ తనకున్న దుప్పట్ల వ్యాపారం చేసేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని వ్యాపారుల నుంచి దుప్పట్లు ఆర్డర్లు తీసుకుని.. తాను నేయడంతో పాటు ఇక్కడున్న మరికొందరు ఆసాములకు ఉపాధి కల్పించేవారు. ఇటీవల అప్పు చేసి ఇల్లు కొన్నారు. అప్పిచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో 4 జోడీల సాంచలను అమ్ముకున్నారు. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో శనివారం సాయంత్రం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది..

  • జగిత్యాల సమీపంలో కరీంనగర్ - జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • కర్ణాటకలోని కలబురగి జిల్లా కమలాపుర తాలూకా మరగుత్తి క్రాస్ వద్ద శనివారం ఉదయం గూడ్స్ వ్యాన్‌ను కారు ఢీకొని భార్యాభర్తలు, కుమారుడితో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన బీడీఎల్ ఉద్యోగి భార్గవ కృష్ణప్ప, ఆయన భార్య సంగీత, వారి కుమారుడు రాఘవ్, మహబూబ్‌నగర్ జిల్లా తాడిపర్తికి చెందిన కారు డ్రైవర్ దుర్గం రాఘవేందర్‌గౌడ్‌గా  పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • ముచ్చర్ల గేట్ వద్ద ఆదివారం కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మెహదీపట్నంలోని ఓ ట్రావెల్స్‌లో కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా.. మార్గమధ్యలో గేట్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Embed widget