Adilabad Robbery News: ఆదిలాబాద్‌లోని ఓ మార్ట్‌లో పట్టపగలే భారీగా నగదు చోరీ, సీసీటీవీలో రికార్డ్
Adilabad Crime News | ఆదిలాబాద్ లోని బేల మండల కేంద్రంలోని శ్రీకర్ మార్ట్ లో చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ లోని ఓ మార్ట్‌లో భారీగా నగదు చోరీ, సీసీటీవీలో రికార్డ్
బేల మండల కేంద్రంలోని శ్రీకర్ మార్ట్ లో ఐదు లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శ్రీకర్ మార్ట్ లో దొంగతనం జరిగింది. సంత కావడంతో బుధవారం నాడు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదే అదునుగా చూసి దొంగలు రెచ్చి పోతున్నారు. ప్రతి బుధవారం సంతలో ఏదో ఒక దొంగ తనం కావడం పరిపాటి, ఇప్పటికే వందల ద్విచక్ర వాహనాలు సైతం దొంగలిస్తున్నారు.
పట్టపగలే మార్ట్‌లో నగదు చోరీ
సంతలో వందల సంఖ్యలో సెల్ పోన్ లు, ప్రజల జేబు నుంచి డబ్బులు పోతున్నాయి. దొంగలు చాకచక్యంగా నగదు, పర్సులతో పాటు వస్తువులు కొట్టేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో పోలీసులు దొంగల్ని పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం శ్రీకర్ మార్ట్ లో కౌంటర్ వద్ద ₹5 లక్షలకు పైగా చోరీ జర్గినట్లు యజమాని శ్రీకర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే చోరీ చేసిన దృశ్యాలు మార్ట్ లోనీ సిసిటివి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రంగంలోకి దిగిన జైనథ్ సిఐ సాయినాథ్, బేల ఎస్సై దివ్య భారతి మార్ట్ ను పరిశీలించారు.
స్థానిక శ్రీకర్ మార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక టింలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఎవరైనా ఈ దొంగలను గుర్తుపట్టినట్లైతే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తప్పనిసరిగా షాపింగ్ కాంప్లెక్స్ వారు, షాపుల వారు సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేసుకోవాలని, దాంతో వీడియో పరిశీలించి దొంగలను పట్టుకోవడం తేలిక అవుతుందన్నారు.
Also Read: Vajedu SI Harish Suicide: వాజేడు ఎస్సై హారీష్ ఆత్మహత్య వెనుక వలపు వల, వెలుగులోకి కిలేడీ మోసాలు