Crime News: బ్యాంకును మోసం చేసి 20 ఏళ్లుగా గెటప్పులు మార్చి, ఎట్టకేలకు మాయగాడి అరెస్ట్
Crime News: బ్యాంకును మోసం చేసి 50 లక్షలు రుణం ఇప్పించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 20 ఏళ్లుగా వివిధ గెటప్పుల్లో తిరిగిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad Crime News: ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఒక వ్యక్తి సరికొత్త పంథాను ఆశ్రయించాడు. అపు తీసుకుని అప్పులు వాళ్లని తప్పించుకుని తిరగడం కంటే తాను పని చేస్తున్న బ్యాంకును మోసం చేసి డబ్బులు కొట్టేయాలని నిర్ణయించాడు. ఇందుకు తన బంధువులను వినియోగించుకున్నాడు. సుమారు రూ.50 లక్షల రూపాయలు రుణాన్ని బంధువులకు ఇప్పించిన సదరు ప్రబుద్ధుడు ఆ తరువాత నుంచి బ్యాంకు అధికారులకు కనిపించకుండా తిరుగుతూ వస్తున్నాడు. బ్యాంకు అధికారులు ఎంత ప్రయత్నించినా అతడి ఆచూకీని కనుగొనలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ఆచూకీ కొన్నాళ్లపాటు లభించలేదు. తాజాగా అతడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బ్యాంకు అధికారులు నుంచి తప్పించుకునేందుకు గెటప్‌లు మార్చినట్టు తేలింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్‌బీఐలో లోన్ ఇప్పించి మోసం
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన చలపతిరావు అనే వ్యక్తి 20 ఏళ్ల కిందట ఎస్‌బీఐ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. 2002లో హైదరాబాద్‌లోని ఒక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన చలపతిరావు ఆ సమయంలోనే బ్యాంకు నుంచి డబ్బులు కొట్టేసేందుకు కీలక ప్రణాళిక రచించాడు. నకిలీ పత్రాలను సృష్టించి తన బంధువులు రూ.50 లక్షలు మేర రుణం బ్యాంకు నుంచి ఇప్పించాడు. ఆ తరువాత నుంచి రుణం తీసుకున్న వ్యక్తితోపాటు రుణం ఇప్పించిన చలపతిరావు కూడా కనిపించకుండా పోయాడు. దీంతో 2004లో నిందితుడిపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి సదరు వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చలపతిరావు సినీ ఫక్కీలో వ్యవహరిస్తూ వచ్చారు. రోజుకో గెటప్ వేసుకుని తిరుగుతూ 20 ఏళ్లుగా పోలీసులను బురిడీ కొట్టిస్తూ వచ్చారు. పేర్లు, వేషాలు మార్చుకుని తిరుగుతున్న చలపతిరావును జీ మెయిల్, ఫోన్ నెంబర్లు ఆధారంగా పోలీసులు ట్రాక్ చేసి గుర్తించారు. శ్రీలంకకు వెళ్లిపోతున్నట్టు గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తమిళనాడులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు.
సైబర్ మోసాల్లో తొలి గంటే కీలకం
గత కొన్నాళ్లుగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కీలక సూచన చేశారు. సైబర్ నేరాలు బారినపడి బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బాధితులకు కీలక సమాచారాన్ని అందించింది. నగదు పోగొట్టుకున్న వ్యక్తులు మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే నేరగాళ్లకు ఆ సొమ్ము చేరకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. సైబర్ నేరానికి గురయ్యామని తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇదిలా, ఉంటే సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న నగదును లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో రీఫండ్ చేస్తున్నారుర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. మార్చి నుంచి జూలై మధ్య రూ.85.05 కోట్ల నగదను రీఫండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,449 కేసుల్లో బాధితులకు ఈ మొత్తాన్ని తిరిగి అందించింది.
Also Read: దళిత మహిళపై పోలీసులు దాడి, షాద్‌నగర్ సీఐతో పాటు ఐదుగురు సస్పెండ్