Hyderabad Murder Case : పెళ్లి చేసుకోమన్నందుకు మర్డర్ - ఇక్కడ చంపేసింది అబ్బాయి కాదు అమ్మాయి !

ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ప్రియడ్ని చంపేసింది ఓ ప్రేమికురాలు. పైగా హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది.

FOLLOW US: 

Hyderabad Murder Case :   ఇద్దరు లవర్స్. ప్రేమించుకున్నారు. ప్రేమలోనే హద్దులు దాటిపోయారు. అన్నీ చేసేసుకున్నారు. వీడియోలు కూడా తీసుకున్నారు. చివరికి తేడా వచ్చింది. అబ్బాయి పెళ్లి చేసుకోనని అంటాడు. అమ్మాయి బోరుమని ఏడుస్తుంది. ఇలాంటి క్రైమ్ స్టోరీలు రొటీన్ . అబ్బాయే అన్నీ చేసేసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవాలని లేకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించడం... నీ పని ఇలా ఉందా..అని ఆ అమ్మాయి ప్రేమికుడ్ని మర్డర్ చేయించడం కొత్త క్రైమ్ ధ్రిల్లర్. నిజంగానే హైదరాబాద్‌లో జరిగింది. 

నిజాంపేటలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి

మీర్‌పేట ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉండే శ్వేతారెడ్డికి సోషల్ మీడియాలో యాష్మకుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. శ్వేతా రెడ్డికి పెళ్లి కూడా అయింది. అయినప్పటికీ ఫన్ కోసమో.. లేకపోతే మరో అవసరం కోసమో కానీ యాష్మకుమార్‌తో ఎఫైర్ కొనసాగించింది. వివాహేతర బంధం ఏర్పర్చుకుంది. కుదరనప్పుడు న్యూడ్ కాల్స్ మాట్లాడుకునేవారు. అయితే యాష్మకుమార్ ... శ్వేతారెడ్డిని సిన్సియర్‌గా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ శ్వేతారెడ్డి మాత్రం అలా అనుకోలేదు. యాష్మకుమార్ తో కలిసి ఉండాలనే ఆలోచన చేయలేదు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు అదే చెప్పింది.  అయితే యాష్మ కుమార్ మాత్రం శ్వేతారెడ్డిని మర్చిపోలేదు. పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. చివరికి పెళ్లికి ఒప్పుకోకపోతే న్యూడ్ కాల్స్ బయటపెడతానని కూడా హెచ్చరించాడు. 

విదేశాలకు మైనర్ల అక్రమ దత్తత, విదేశీ విరాళాల అక్రమ సేకరణ - గుంటూరు జడ్పీ చైర్మన్ భర్తపై తీవ్రమైన కేసులు !

సీన్ కట్ చేస్తే ఓ రోజు రోడ్‌పై యాష్మ కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. రోడ్డు ప్రమాదం అని పోలీసులు అనుకున్నారు. అలాంటి సీన్ క్రియేట్ చేశారు. కానీై పోలీసులు అలాంటి కేసులు చాలా చూసి ఉన్నారు కాబట్టి తేడా కొట్టింది. వివరాలు బయటకు తీస్తే న్యూడ్ కాల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వాటిని పట్టుకుని మిగతా కథ అంతా రివీల్ చేశారు. క్లైమాక్స్ ఏమిటంటే... యాష్మకుమార్ న్యూడ్ కాల్స్ బయటపెడతానని బెదిరించిన తర్వాత ... శ్వేతారెడ్డి ఆర్ఎక్స్ 100 సినిమా హీరోయిన్ టైప్‌లో ఆలోచించింది. స్నేహితుల్ని మాట్లాడింది. యాష్మకుమార్‌తో మత్తుగా మాట్లాడి పిలిపించింది. అందరూ కలిపి చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి వెళ్లిపోయారు. కానీ పోలీసులు తీగ లాగేసరికి దొరికిపోయారు. ఇప్పుడు శ్వేతారెడ్డితో పాటు ఇద్దరు మిత్రులు కూడా కటకటాల పాలయ్యారు. 

Published at : 12 May 2022 05:16 PM (IST) Tags: Hyderabad crime Hyderabad lover murder Priyudi murder

సంబంధిత కథనాలు

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి

Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

టాప్ స్టోరీస్

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు

NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !