Stock Market Loss : స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే - హారతి కర్పూరమైన రూ. 3 లక్షల కోట్లకుపైగా మదుపర్ల సంపద!
స్టాక్ మార్కెట్లలో బ్లాక్ మండే తరహా పరిస్థితులు కనిపించాయి. సెన్సెక్స్ 1,172 పాయింట్లు తగ్గిపోగా రూ. 3 లక్షల కోట్లపైగా సంపద ఆవిరైపోయింది.
సోమవారం స్టాక్ మార్కెట్ ( Stock Market ) ప్రధాన స్టాక్ సూచీల్లో భారీ పతనం నమోదయింది. సెన్సెక్స్ ( Sensex ) 1172.19 పాయింట్లు క్షీణించి 57,166.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,173.70 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్ నష్టపోయాయి. ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోల్ ఇండియా, టాటా స్టీల్ లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్‌లో చివరి ట్రేడింగ్ ఏప్రిల్ 13న జరగగా, ఆ తర్వాత వరుస సెలవుల కారణంగా నాలుగు రోజుల పాటు ట్రేడింగ్ నిలిచిపోయింది.
Sensex tumbles 1,172.19 points to end at 57,166.74; Nifty tanks 302 points to 17,173.65
— Press Trust of India (@PTI_News) April 18, 2022
తక్కువ ధరలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు కావాలనుకునేవారికి ఏది బెస్ట్?
సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం ప్రారంభమైన ప్రధాన స్టాక్ సూచీల్లో భారీ పతనం కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 1130 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 300 పాయింట్లు పతనమై ట్రేడింగ్ ప్రారంభించింది. ఎక్కడా కోలుకోలేదు. సెన్సెక్స్ 1,172 పాయింట్లు పతనమవడంతో, ఈక్విటీ మార్కెట్లు టెయిల్‌స్పిన్‌లోకి వెళ్లడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లకు పైగా పడిపోయింది.
ఆమ్వేకు ఈడీ షాక్ - వందల కోట్ల ఆస్తులు సీజ్!
బీఎస్‌ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,39,088.04 కోట్లు పడిపోయి రూ. 2,68,63,975.53 కోట్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా, డాలర్ ఇండెక్స్ 100 కంటే ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం పొడిగిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అంచనా వేయడంతో సెంటిమెంట్‌లు ప్రతికూలంగా మారాయి. దేశీయంగా ద్రవ్యోల్భణం పదిహేడు నెలల గరిష్టానికి చేరుకున్నది. అమెరికా ద్రవ్యోల్భణం కూడా ఆందోళనకరంగా ఉండటం, ఫెడ్ వడ్డీ రేటు పెంపు అభిప్రాయాలు మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. రష్యా-ఉక్రెయన్ పరిణామాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. చైనాలో ఆర్థిక వృద్ధి గత త్రైమాసికంలో మందగించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి
వర్చూస్ వచ్చేది అప్పుడే - అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ చేయనున్న ఫోక్స్‌వాగన్ - పవర్‌ఫుల్ ఇంజిన్లు కూడా!