By: ABP Desam | Updated at : 16 Apr 2022 08:43 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఫోక్స్‌వాగన్ వర్ట్యూస్ కారు మనదేశంలో జూన్ 9వ తేదీన లాంచ్ కానుంది.
ఫోక్స్‌వాగన్ వర్చూస్ కారును మనదేశంలో గత నెలలో ప్రదర్శించింది. ఈ కారు తయారీని కూడా మనదేశంలో ప్రారంభించింది. ఇప్పుడు ఈ కారు లాంచ్ తేదీని కూడా అఫీషియల్‌గా ప్రకటించింది. జూన్ 9వ తేదీన ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. వెంటోకి రీప్లేస్‌మెంట్‌గా ఈ కారు లాంచ్ కానుంది. స్కోడా స్లేవియా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వాగన్ టైగున్‌లను రూపొందించిన ప్లాట్‌ఫాంపైనే ఈ కారును కూడా రూపొందించారు.
ఈ కారున భారతీయ మార్కెట్‌కు తగ్గట్లు 95 శాతం లోకలైజేషన్ చేశామని ఫోక్స్‌వాగన్ అంటోంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లేవియాలతో ఫోక్స్‌వాగన్ వర్చూస్ పోటీ పడనుంది.
రెండు టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లతో ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. ఈ కారు ఎంట్రీ లెవల్ మోడల్లో 1.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 113 బీహెచ్‌పీ, 178 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో ఈ కారు మార్కెట్లోకి రానుంది.
హైఎండ్ వేరియంట్లో 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది 148 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సెవెన్ స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లాంచ్ కానుంది. ఇందులో యాక్టివ్ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ ఉండనుంది. లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేసేందుకు నాలుగు సిలిండర్లలో రెండు ఈ టెక్నాలజీ ద్వారా డీయాక్టివేట్ అవుతాయి.
స్లేవియా లాగానే ఫోక్స్‌వాగన్ వర్చూస్‌లో కూడా బెస్ట్ వీల్ బేస్, బూట్ స్పేస్ ఉండనుంది. 10 అంగుళాల టచ్ స్క్రీన్, 8 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఎయిట్ స్పీకర్ సౌండ్ సిస్టం, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ, వెనకవైపు ఏసీ వెంట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు ఈ కారులో ఉన్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎనిమిది స్పీకర్ల సౌండ్ సిస్టంను కూడా ఫోక్స్‌వాగన్ వర్చూస్‌లో అందించింది.
ఫోక్స్‌వాగన్ సేఫ్టీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు. అలానే ఇందులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ ఉన్న ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉండనున్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Kia EV6 Review: ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎస్యూవీ " కియా ఈవీ 6 "
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?
Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!
Breaking News Live Updates: జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం : సీఎం కేసీఆర్
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
YSRCP Bus Yatra : బస్సుల్లోనే మంత్రులు - యాత్రలో కిందకు దిగేందుకు నిరాసక్తత !
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!