అన్వేషించండి

RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ

Polymer Banknotes India: ఆర్‌బీఐ త్వరలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనుంది. పెరిగిన కరెన్సీ ముద్రణ ఖర్చును తగ్గించేందుకు, నోట్ల మన్నికను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Benefits of Plastic Currency: భారతీయ రిజర్వ్ బ్యాంక్  దేశంలో కరెన్సీ నిర్వహణ ఖర్చును తగ్గించేందుకు , నోట్ల మన్నికను పెంచేందుకు విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. త్వరలోనే సాధారణ కాగితపు నోట్ల స్థానంలో  ప్లాస్టిక్ నోట్లను  ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రవేశపెట్టాలని కేంద్ర బ్యాంకు యోచిస్తోంది.  
 
భారతదేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు ఏటా భారంగా మారుతోంది. RBI వార్షిక నివేదిక ప్రకారం, నోట్ల ముద్రణ వ్యయం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,101.4 కోట్ల నుండి రూ. 6,372.8 కోట్లకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం చిరిగిపోయిన లేదా పాడైపోయిన నోట్లను ఉపసంహరించుకుని వాటి స్థానంలో కొత్తవి ముద్రించాల్సి రావడమే. కేవలం ఒక్క ఏడాదిలోనే  సుమారు 23.8 బిలియన్ల పాత నోట్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ. 500. రూ. 100 నోట్లే అధికంగా ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

 ఏమిటీ పాలిమర్ నోట్లు? 

పాలిమర్ నోట్లు అంటే సింథటిక్ ప్లాస్టిక్ మిశ్రమంతో తయారయ్యే కరెన్సీ. ఇవి సాధారణ కాగితపు నోట్ల కంటే సుమారు 2.5 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోవడం, తడిసిపోవడం లేదా మురికి కావడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ, ప్లాస్టిక్ నోట్లు నీటికి తడిసినా ఏమీ కావు, వీటిని అంత సులభంగా చించివేయలేము. మన్నిక ఎక్కువగా ఉండటం వల్ల వీటిని పదేపదే ముద్రించాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ముద్రణ ఖర్చు ఆదా అవుతుంది.

 భద్రతలో మేటి.. నకిలీ నోట్లకు చెక్! 

ప్లాస్టిక్ నోట్లను నకిలీ చేయడం  అంత సులభం కాదు. వీటిలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. పారదర్శకమైన ప్లాస్టిక్ విండోస్, లోహపు పొరలు ,   అతినీలలోహిత  కాంతికి స్పందించే రసాయన గుర్తులు వంటివి ఉండటం వల్ల దొంగ నోట్ల బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, న్యూజిలాండ్ సహా దాదాపు 45కు పైగా దేశాలు ఈ టెక్నాలజీని విజయవంతంగా వాడుతున్నాయి.  

 పర్యావరణానికి మేలు.. రీసైక్లింగ్ సులభం 

సాధారణ కాగితపు నోట్లు పాడైపోతే వాటిని ముక్కలు చేసి భూమిలో పూడ్చివేస్తారు  . కానీ, ప్లాస్టిక్ నోట్లు వినియోగానికి పనికిరాని స్థితికి చేరినప్పుడు, వాటిని రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. వీటిని చిన్న చిన్న బిళ్లలుగా  మార్చి, గార్డెన్ ఫర్నిచర్ వంటి ఇతర ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. అంటే, ఇవి ఆర్థికంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు.
 
భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో నోట్ల చలామణి చాలా వేగంగా జరుగుతుంటుంది. చేతులు మారే కొద్దీ నోట్లు త్వరగా పాడైపోతుంటాయి.   ఆర్‌బీఐ ప్రవేశపెట్టనున్న ప్లాస్టిక్ నోట్లు కరెన్సీ నిర్వహణలో పెద్ద మార్పు తీసుకురానున్నాయి. త్వరలోనే ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని సమాచారం. ఇదే జరిగితే, మన పర్సుల్లో ఉండే కరెన్సీ నోట్లు ఇకపై చిరగవు, తడవవు.. మరింత కాలం సురక్షితంగా ఉంటాయి!

టాప్ హెడ్ లైన్స్

Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget