By: ABP Desam | Updated at : 09 Dec 2021 07:05 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Cryptocurrency
క్రిప్టో కరెన్సీ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది! నియమాలను ఉల్లంఘించే కఠిన చర్యలు తీసుకోనుంది. కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో నియమాలను పొందుపరిచిందని తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడే వారిని వారెంట్ లేకుండా అరెస్టు చేస్తారని, బెయిల్ లేకుండా జైల్లోంచే ఉంచేస్తారని సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనున్న సంగతి తెలిసిందే. శీతకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు చర్చించిన తర్వాత ఆమోదించనున్నారు.
మొదట క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని సమాచారం రావడంతో స్టేక్‌హోల్డర్లంతా తమ పెట్టుబడులను నష్టాలతోనే ఉపసంహరించేందుకు పూనుకున్నారు. కొందరు నష్టపోయారు. అయితే వర్చువల్ కరెన్సీని నిషేధించడం లేదని తర్వాత వార్తలు వచ్చాయి. 'క్రిప్టో కరెన్సీ'లో కరెన్సీ అనే పదాన్ని తొలగిస్తున్నారు. క్రిప్టో అసెట్‌గా మాత్రమే ట్రేడింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు! ఎట్టిపరిస్థితుల్లోను కరెన్సీగా, లావాదేవీలకు వాడుకోనివ్వరు.
క్రిప్టో కరెన్సీపై తేబోతున్న బిల్లులోని నిబంధనలను వ్యక్తులు, కార్పొరేషన్లు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. వారికి రూ.20 కోట్లు జరిమానా విధిస్తారు. ఏడదిన్నర కాలం జైలు శిక్ష విధిస్తారు. ప్రైవేటు క్రిప్టో లావాదేవీలను నిషేధించడమే కాకుండా ట్రేడింగ్‌ను నియంత్రించనున్నారు. వ్యక్తులు క్రిప్టో మైనింగ్, జనరేటింగ్, హోల్డింగ్, సెల్లింగ్, డీలింగ్‌ను నగదు మార్పిడి కింద వినియోగించినా, భద్రపరిచినా జైలు శిక్ష తప్పదు. వారెంటు లేకుండా ఊచలు లెక్కపెట్టిస్తారు. ఊహాతీతమైన క్రిప్టో ప్రకటనల పైనా చర్యలు తీసుకొంటారని తెలుస్తోంది.
Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?
Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!
Also Read: Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Indian Mobile Congress 2021: మెరుపు వేగంతో దేశంలో 5Gని ప్రవేశపెట్టాలన్న ముకేశ్ అంబానీ
Also Read: Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇది.!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల
Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి
Jeep Meridian: ఫార్చ్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!
Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్
KTR Jagan Meet: దావోస్‌లో అరుదైన కలయిక, ఒకే ఫ్రేంలో డైనమిక్ లీడర్స్ - నా అన్నతో గ్రేట్ మీటింగ్ అంటూ కేటీఆర్ ట్వీట్