Toyota Motor sales in September 2025: అమ్మకాల్లో దూసుకుపోతున్న టయోటా కంపెనీ.. టాప్ లో నిలిచిన మోడళ్లు ఏవంటే..?
Toyota Motor: దేశీయ డిమాండ్ ను అందిపుచ్చుకుంటూ టయోటా కంపెనీ అమ్మకాల్లో మంచి వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కంపెనీలోని చాలా మోడళ్లు మంచి అమ్మకాలను నమోదు చేశాయి.

Toyota Motor sales Letest News: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (Toyota Kirloskar Motor) సెప్టెంబర్ 2025లో ఘనమైన విక్రయాలను (Sales) నమోదు చేసింది. గత సంవత్సరం (YoY) గత నెల (MoM)తో పోలిస్తే డిమాండ్ పెరగడంతో పాటు, క్యూ3 2025 (Q3 2025) త్రైమాసికంలో (Quarterly) కూడా సానుకూల వృద్ధి కనిపించింది. సెప్టెంబర్ 2025లో టయోటా విక్రయాలు 13.81% పెరిగి 27,089 యూనిట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 23,802 యూనిట్లతో పోలిస్తే ఇది 3,287 యూనిట్ల పెరుగుదల కావడం విశేషం. నెలవారీ విక్రయాలు (MoM) ఆగస్టు 2025లో అమ్ముడైన 26,453 యూనిట్ల కంటే 2.40% వృద్ధిని చూపించాయి. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టయోటా హైరైడర్ (Hyryder) అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఇది 7,608 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, 41.28% YoY వృద్ధిని చూపించింది, కానీ ఆగస్టు 2025లో అమ్ముడైన 9,100 యూనిట్లతో పోలిస్తే MoM విక్రయాలు 16.40% తగ్గాయి.
డిమాండ్ పెరుగుదల..
భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టయోటా హైక్రాస్ (HyCross) డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీని విక్రయాలు 6,436 యూనిట్లకు చేరి, YoY 39.73% ,MoM 10.45% వృద్ధిని సాధించాయి. మరోవైపు, ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) విక్రయాలు 3,347 యూనిట్లకు తగ్గి, YoY మరియు MoM క్షీణతను చూపించాయి. అయితే, ఫార్చ్యూనర్ (Fortuner) విక్రయాలు 2,783 యూనిట్లకు మెరుగుపడి, YoY మరియు MoM పరంగా గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. టయోటా గ్లాంజా (Glanza) 3,299 యూనిట్లతో 1.63% YoY వృద్ధిని సాధించినప్పటికీ, MoM విక్రయాలు 35.34% పడిపోయాయి. టేసర్ (Taisor) విక్రయాలు 2,297 యూనిట్లకు తగ్గగా, రుమియన్ (Rumion) విక్రయాలు 57.88% YoY క్షీణతను చూపించినప్పటికీ, ఆగస్టు 2025లో 68 యూనిట్లతో పోలిస్తే MoM 1119.12% భారీ వృద్ధిని సాధించింది.
మంచి పనితీరు..
Q3 2025 త్రైమాసికంలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మొత్తం 85,550 యూనిట్ల విక్రయాలతో బలమైన పనితీరును కనబరిచింది. ఇది Q3 2024లో అమ్ముడైన 81,924 యూనిట్ల కంటే 4.43% మెరుగుదల. హైరైడర్ విక్రయాలు 31.98% పెరిగి 25,522 యూనిట్లకు, హైక్రాస్ విక్రయాలు 22.19% పెరిగి 18,070 యూనిట్లకు చేరాయి. గ్లాంజా విక్రయాలు కూడా 13,420 యూనిట్లకు పెరిగాయి. అయితే, క్రిస్టా విక్రయాలు మాత్రం 21.19% తగ్గి 10,136 యూనిట్లకు పడిపోయాయి. ఫార్చ్యూనర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన దాని విక్రయాలు 18.54% మెరుగుపడి 8,524 యూనిట్లకు పెరిగాయి. టేసర్ ,రుమియన్ విక్రయాలు Q3 2025లో వరుసగా 18.01% మరియు 73.78% క్షీణతను చూపించాయి. హైలక్స్ (Hilux) (849 యూనిట్లు) డబుల్ డిజిట్ వృద్ధిని సాధించగా, క్యామ్రీ (Camry) విక్రయాలు 12.04% మెరుగుపడి 456 యూనిట్లకు పెరిగాయి. వెల్‌ఫైర్ (Vellfire) విక్రయాలు 391 యూనిట్లుగా నమోదు కాగా, ఎల్‌సి300 (LC300) 42 యూనిట్లతో కంపెనీ మొత్తం విక్రయాలకు దోహదపడింది. ఈ గణాంకాలు టయోటా కొత్త మోడళ్లు హైరైడర్, హైక్రాస్ మార్కెట్‌లో బలమైన పట్టు సాధించడాన్ని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.





















