(Source: Poll of Polls)
ఈ ఏడాది టాప్-10 బెస్ట్ సెల్లింగ్ MPVs - హాట్ కేకుల్లా ఎగబడి కొన్నారు
FY26 మొదటి అర్ధ భాగం (H1)లో MPV సెగ్మెంట్‌లో 93,235 యూనిట్లు అమ్మిన ఎర్టిగా మొదటి స్థానంలో, 25% వృద్ధితో కియా కారెన్స్ రెండో స్థానంలో సత్తా చాటాయి.

10 Best Selling MPVs In 2025 India: SUVల హడావుడి మధ్యలోనూ, భారత మార్కెట్లో MPV సెగ్మెంట్ మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదు. ఫ్యామిలీ ట్రిప్స్, సిటీ డ్రైవ్స్‌కి సరిపోయే ఈ "3-రో" వెహికల్స్‌కు డిమాండ్ అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా GST 2.0 వల్ల వచ్చిన ధరల తగ్గింపు, పండుగ సీజన్ ఆఫర్లతో MPV మార్కెట్ ఇంకా చురుకుగా మారింది.
1. Maruti Suzuki Ertiga - MPVల రాజు
FY26 మొదటి సగ భాగం (ఏప్రిల్-సెప్టెంబర్ 2025) లో 93,235 యూనిట్లు అమ్మిన మారుతి సుజుకీ ఎర్టిగా, మళ్లీ సగం మార్కెట్‌ను ఒంటరిగా గెలుచుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 2% తక్కువైనా, ఈ మోడల్‌కు డిమాండ్ మాత్రం ఎప్పటిలానే గట్టిగా ఉంది. 1.5-లీటర్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్, అలాగే CNG ఆప్షన్‌తో అందుబాటులో ఈ వెహికల్ అందుబాటులో ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉండటం వల్ల కుటుంబాలకి ఇది సూపర్ ఫిట్.
2. Toyota Innova Crysta / Hycross - నమ్మకానికి కొత్త రూపం
53,589 యూనిట్ల అమ్మకాలతో టయోటా ఇన్నోవా రెండో స్థానంలో నిలిచింది. హైక్రాస్ ఇప్పుడు క్రిస్టా కన్నా ఎక్కువగా అమ్ముడవుతోంది. డీజిల్ క్రిస్టా ఇప్పటికీ లాయల్ కస్టమర్లకు ఫేవరెట్. పెట్రోల్-హైబ్రిడ్ హైక్రాస్ విషయానికి వస్తే, ఇది 16 kmpl వరకు మైలేజ్ ఇస్తూ ఫ్యామిలీ ట్రావెల్‌కి కొత్త లగ్జరీ టచ్ ఇచ్చింది.
3. Kia Carens / Clavis / Clavis EV - వేగం, వేరియంట్స్, ఎలక్ట్రిక్ అప్‌గ్రేడ్
కియా తన స్ట్రాంగ్ ఎంట్రీతో 41,831 యూనిట్లు విక్రయించి 25% వృద్ధి సాధించింది. మే 2025లో క్లావిస్, జూలై 2025లో క్లావిస్ EV విడుదల కావడంతో అమ్మకాలు రాకెట్‌లా పెరిగాయి. 490 కి.మీ. రేంజ్ గల క్లావిస్ EV, 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో 21 వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇది కియాకు గేమ్-చేంజర్‌గా మారింది.
4. Maruti Suzuki XL6 - కంఫర్ట్‌లో ఎర్టిగా సిస్టర్
మారుతి XL6 16,947 యూనిట్లు అమ్మింది. ఇది ఎర్టిగా ఆధారంగా తయారైనప్పటికీ, 6-సీటర్ లేఅవుట్, ప్రీమియం ఇంటీరియర్, కంఫర్ట్ లెవెల్స్‌తో భిన్నత్వం చూపిస్తోంది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 13% తగ్గాయి.
5. Renault Triber - బడ్జెట్ ఫ్యామిలీ ఛాయిస్
జూలై 2025లో ఫేస్‌లిఫ్ట్ రావడంతో ట్రైబర్ తిరిగి బౌన్స్ అయింది. గత ఏడాది ఇదే కాలం కంటే 10,677 యూనిట్లు ఎక్కువ అమ్మి 6% వృద్ధి సాధించింది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఈ కారును బడ్జెట్ MPVగా నిలిపాయి.
6. Toyota Rumion - ఈసారి తగ్గిన వేగం
7,267 యూనిట్లు విక్రయించిన ఈ వెహికల్, 29% తగ్గుదల నమోదు చేసింది. ఎర్టిగా బేస్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన రుమియన్, గత ఏడాది బలంగా నడిచినా ఈసారి మాత్రం స్లో అయ్యింది.
7. Maruti Suzuki Invicto - ప్రీమియం హైబ్రిడ్ ఎంపిక
మారుతి ఇన్‌విక్టో FY26 H1లో 1,491 యూనిట్లు అమ్మి 19% వృద్ధి సాధించింది. టయోటా-మారుతి భాగస్వామ్యంలో తయారైన ఈ ప్రీమియం MPV, హైబ్రిడ్ టెక్నాలజీతో ఫ్యూయల్ ఎఫిషియంట్ ఫ్యామిలీ వెహికల్‌గా నిలిచింది.
8. Toyota Vellfire - లగ్జరీకి కొత్త నిర్వచనం
596 యూనిట్లు అమ్మిన టయోటా వెల్‌ఫైర్, గత ఏడాది కంటే 14% వృద్ధి సాధించింది. 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్, e-CVT గేర్‌బాక్స్, లాంజ్ లాంటి ఫీల్ ఇచ్చే క్యాబిన్ దీని హైలైట్. MG M9 EV వంటి కొత్త ప్రత్యర్థులను కూడా ఇది ప్రభావితం చేసింది.
9. Kia Carnival - ప్రీమియం లిమోసిన్ టచ్
అక్టోబర్ 2024లో విడుదలైన కార్నివాల్ లిమోసిన్ మోడల్ 425 యూనిట్లు అమ్మింది. రెండో వరుసలో పవర్డ్ రిలాక్సేషన్ సీట్స్, హీటింగ్, లెగ్ సపోర్ట్ వంటి సదుపాయాలు ఉన్న ఈ డీజిల్ MPV ఫ్యామిలీ లగ్జరీకి కొత్త అర్థం చెప్పింది.
10. Mahindra Marazzo - రీ-ఎంట్రీతో ఇంప్రెస్
మహీంద్రా SUVల మధ్య తిరుగుతున్న ఏకైక MPV అయిన మరాజ్జో, 252 యూనిట్లు అమ్మి 227% వృద్ధి సాధించింది. దీని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ శక్తిమంతమైనది, రోడ్డు మీద మళ్లీ తన స్థాయిని ప్రదర్శించింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ MPVలు కుటుంబ వాహనాల జాబితాలో టాప్ ప్లేస్‌లు దక్కించుకున్నాయి. SUV ట్రెండ్ ఉన్నా, ఈ 3-రో వాహనాల ఉపయోగం, ధర, ఫీచర్లు చూసి యువత కూడా ఇప్పుడు MPV వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















