అన్వేషించండి

హైదరాబాద్‌ Eimor Customs హెల్మెట్‌ పెయింట్స్‌, మీకు నచ్చిన డిజైనింగ్‌ - చూసేవాళ్లకు షాక్‌!

హైదరాబాద్‌లోని Eimor Customs చేతితో పెయింట్‌ చేసిన స్పెషల్‌ హెల్మెట్‌ యూత్‌లో క్రేజ్‌గా మారింది. ఒక్కో హెల్మెట్‌ తయారీకి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చవుతుంది.

Custom Painted Helmet By Eimor Customs, Hyderabad: హైదరాబాద్‌లోని Eimor Customs పేరు గురించి బైక్‌ ప్రేమికులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే, బైక్‌లను అద్భుతంగా కస్టమైజ్‌ చేస్తున్న ఈ టీమ్‌, ఇప్పుడు హెల్మెట్‌ డిజైన్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. చేతితో పెయింట్‌ చేసిన ఈ కస్టమ్‌ హెల్మెట్‌లు ఇప్పుడు యువతలో కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి.

ఐడియా ఎలా మొదలైంది?
కొన్నాళ్ల క్రితం, రైడర్‌ రిషాద్‌ మోడీ తన హెల్మెట్‌ను Eimor Customs టీమ్‌కు ఇచ్చారు. అప్పుడు ఆయనకు హెల్మెట్‌ డిజైనింగ్‌పై ఎలాంటి స్పష్టమైన ఆలోచన లేదు. కానీ, ఈ ప్రాజెక్టును హ్యాండిల్‌ చేసిన జాయ్‌ (Joy), రిషాద్‌ మోడీతో వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా చర్చలు జరిపారు. ఆయనకు ఇష్టమైన రంగులు, థీమ్‌, ఫీల్‌ అన్నింటినీ కలిపి ఒక ‘మెరైన్‌ లైఫ్‌’ థీమ్‌ హెల్మెట్‌ రూపుదిద్దారు. సముద్ర జీవుల నుంచి స్ఫూర్తి పొందిన ఈ హెల్మెట్‌లో ఆంగ్లర్‌ ఫిష్‌, మోరే ఈల్‌, హ్యామర్‌హెడ్‌ షార్క్‌ వంటి ఆర్ట్‌వర్క్‌లు ఉన్నాయి.

డిజైన్‌లో క్రియేటివిటీ
జాయ్‌ ప్రతీ స్టేజ్‌లో కొత్తగా ఆలోచించారు. సాధారణ లోగో ప్లేస్‌ చేయకుండా, హ్యామర్‌హెడ్‌ షార్క్‌ ఈ యునిక్‌ పెయింట్‌ను స్ప్రే పెయింట్‌ చేస్తున్నట్లు చూపించారు. అంతేకాదు, యజమాని పేరు, బ్లడ్‌ గ్రూప్‌ను డైవర్‌ ఆకారంలో చూపించడం కూడా సూపర్‌ ఇన్నోవేటివ్‌ ఐడియా. రంగుల ఎంపికలో కూడా జాయ్‌ ప్రత్యేక దృష్టి పెట్టి, వెర్మిలియన్‌ షేడ్‌ అనే స్పెషల్‌ రెడ్‌ టోన్‌ను ఎంచుకున్నారు.

పెయింటింగ్‌ ప్రాసెస్‌
ఈ హెల్మెట్‌ పూర్తిగా చేతితో తయారైంది. ఐదు దశల్లో పెయింటింగ్‌ జరిగింది. మొదట బ్లాక్‌ బేస్‌ కోట్‌, తరువాత ఒక్కో డిజైన్‌ భాగాన్ని ఎయిర్‌ బ్రష్‌ లేదా ఫైన్‌ బ్రష్‌తో ఖచ్చితత్వంతో పూత వేశారు. ప్రతి కోణంలో ఉన్న స్పాయిలర్‌, వెంట్స్‌ వదిలి పెట్టకుండా, వాటి మధ్య గ్యాప్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ఫినిషింగ్‌ & క్వాలిటీ
తయారీ పూర్తయిన తర్వాత వచ్చిన ఫలితం నిజంగా అద్భుతంగా కనిపించింది. ఈ డిజైన్‌ హెల్మెట్‌ ఆకారానికి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అయితే కొన్ని చోట్ల ఫినిషింగ్‌లో చిన్న లోపాలు కనిపించవచ్చు, అది పూర్తిగా చేతితో చేసినది కావడంతో అది సహజమే. Eimor ఆటోమోటివ్‌ గ్రేడ్‌ పెయింట్స్‌ వాడుతుంది, ఇవి FIA హెల్మెట్‌ పెయింటింగ్‌ గైడ్‌లైన్‌ ప్రకారం సేఫ్‌.

ఖర్చు & ఎక్స్‌క్లూజివిటీ
ఇలాంటి హెల్మెట్‌ తయారీకి సుమారు ₹25,000–₹30,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది ఎక్కువగా అనిపించినా, పూర్తిగా మీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒకే ఒక్క డిజైన్‌ కావడం దీని ప్రత్యేకత. సాధారణ మార్కెట్‌లో దొరికే హెల్మెట్‌లతో పోలిస్తే ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

Eimor Customs కేవలం పెయింట్‌ కాదు - ఇది ఆర్ట్‌ & పర్సనాలిటీ కలయిక. మీ బైక్‌ ప్యాషన్‌ను హెల్మెట్‌లో చూపించాలనుకుంటే, ఈ టీమ్‌తో కాంటాక్ట్‌ అయితే సరిపోతుంది. మీకు నచ్చిన థీమ్‌, మీ కోసమే ఉన్న యునిక్‌ డిజైన్‌ - ఇదే Eimor స్టైల్‌. హైదరాబాద్‌ నుంచి దేశవ్యాప్తంగా యువ రైడర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ హెల్మెట్‌ డిజైన్‌లు, మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇతరుల కళ్లను తిప్పుకోనివ్వవు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
Embed widget