Toyota Fortuner Leader 2025 ఎడిషన్ లాంచ్ - పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్, ప్రీమియం లుక్‌తో అదరగొట్టే SUV
Toyota Fortuner Leader ఎడిషన్ 2025 ఇండియాలో లాంచ్ అయింది. కొత్త డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్ & శక్తిమంతమైన 2.8L డీజిల్ ఇంజిన్‌తో ఇది వచ్చింది.

Toyota Fortuner Leader Edition 2025 Launch: ప్రజలకు ఇష్టమైన లగ్జరీ SUV ఫార్చ్యూనర్‌లో కొత్త వెర్షన్ వచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM), టయోటా ఫార్చ్యూనర్ కొత్త & అప్‌డేటెడ్ వెర్షన్ "2025 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్"ను లాంచ్ చేసింది. దీనిని గతంలో కంటే స్పోర్టియర్, ప్రీమియం & మరింత ఆధునిక డిజైన్‌తో ఈ కంపెనీ పరిచయం చేసింది. లగ్జరీ, పవర్ & స్ట్రాంగ్ స్టైల్ పరిపూర్ణ కలయికను కోరుకునే కస్టమర్ల కోసం ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్.. భారతీయ SUV మార్కెట్లో ప్రీమియం స్టాండర్డ్స్‌ను పెంచుతుందని & తమ కంపెనీ లగ్జరీ SUV రేంజ్ మరింత బలోపేతం చేస్తుందని టయోటా చెబుతోంది.
డిజైన్ అప్‌డేట్స్
2025 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ బయటి భాగాన్ని మునుపటి కంటే మరింత డైనమిక్ & బోల్డ్‌గా డిజైన్ చేశారు. ఈ SUV లో కొత్త ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ బంపర్ స్పాయిలర్ & బ్లాక్ డ్యూయల్-టోన్ రూఫ్ వంటి డిజైన్ అప్‌డేట్స్ వచ్చాయి. బ్లాక్ గ్లోసీ అల్లాయ్ వీల్స్, క్రోమ్ గార్నిష్ & బోనెట్‌పై సిగ్నేచర్ "లీడర్" చిహ్నం కూడా ఉన్నాయి. ఈ SUV నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది, అవి: యాటిట్యూడ్ బ్లాక్, సూపర్ వైట్, పెర్ల్ వైట్ & సిల్వర్. ఈ రంగులు ఈ బోల్డ్ SUV కి మరింత ప్రీమియం అప్పీల్ ఇస్తాయి.
ఇంటీరియర్ & ఫీచర్లు
ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ క్యాబిన్ పూర్తిగా కొత్త & అప్‌గ్రేడెడ్ ఫీల్ ఇస్తుంది. బ్లాక్ & మెరూన్ డ్యూయల్-టోన్ సీట్లతో పాటు ప్రీమియం-క్వాలిటీ పదార్థాలను ఇంటీరియర్‌లో ఉపయోగించారు. ఈ SUV లో ఇప్పుడు ఆటో-ఫోల్డింగ్ మిర్రర్లు, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను యాడ్ చేశారు.
ఇంజిన్ & పవర్
ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ 2.8-లీటర్ టర్బోచార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది 201 bhp & 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV 6-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంది. ఈ SUV ప్రస్తుతం రియర్-వీల్ డ్రైవ్ (4x2) వేరియంట్‌లో వచ్చింది. దీనివల్ల ఇది అద్భుతమైన నియంత్రణ & సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇంధన సామర్థ్యం & లాంగ్-డ్రైవ్ సౌకర్యం కోసం ఈ ఇంజిన్ ఆప్టిమైజ్ చేసినట్లు టయోటా వెల్లడించింది.
బుకింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
2025 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ కోసం బుకింగ్స్ ఈ నెల (అక్టోబర్ 2025) రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కస్టమర్లు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లేదా వారి టయోటా డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ, అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు & బుకింగ్‌లతో ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది.





















