Maruti Victoris నుంచి Toyota Hyryder వరకు - టాప్-3 చవకైన హైబ్రిడ్ SUVలు ఇవే
Maruti Victoris కేవలం ₹10.49 లక్షలు ధరతో దేశంలో అత్యంత అందుబాటు ధర హైబ్రిడ్ SUVగా మారింది. ఈ హైబ్రిడ్ కారు Toyota Hyryder & Grand Vitara తో పోటీ పడుతుంది.

Cheapest Hybrid SUVs In India 2025: భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ హైబ్రిడ్ టెక్నాలజీ వైపు స్టీరింగ్ తిప్పుతోంది. హైబ్రిడ్ విభాగం విస్తరిస్తున్న కొద్దీ, తెలివైన కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలు & సాంప్రదాయ పెట్రోల్ కార్ల మధ్య సమతుల్యతగా హైబ్రిడ్ SUVలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మన మార్కెట్‌లో, కేవలం ₹10.50 లక్షల నుంచి ప్రారంభమయ్యే అత్యంత అందుబాటు ధర హైబ్రిడ్ SUVలలో మూడుంటిని ఇక్కడ అన్వేషిద్దాం.
Maruti Victoris
మారుతి విక్టోరిస్ దేశంలోనే అత్యంత బడ్జెట్ హైబ్రిడ్ SUV, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹10.49 లక్షలు. ఇది మారుతి బ్రెజ్జా & గ్రాండ్ విటారా మధ్య స్థాయిలో ఉంటుంది & ARENA డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతోంది. విక్టోరిస్, ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఈ ఇంజిన్ తక్కువ వేగంతో ఎలక్ట్రిక్ మోటారుతో పవర్ జనరేట్ చేస్తుంది, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది & అదే సమయంలో మైలేజీని కూడా పెంచుతుంది. మారుతి విక్టోరిస్ క్లెమ్‌డ్ మైలేజ్ 28.65 kmpl, ఇది భారతదేశంలో అత్యంత ఇంధన-సమర్థ హైబ్రిడ్ SUVగా నిలిచింది.
మారుతి విక్టోరిస్‌లో... LED హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ & మోడ్రన్ లుక్స్‌తో ఉంటుంది. క్యాబిన్ లోపల, పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ & పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS-EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ & ISOFIX మౌంట్స్ అమర్చారు. మీరు మొదటిసారి హైబ్రిడ్ SUVని కొనుగోలు చేస్తుంటే & మీ బడ్జెట్ ₹11 లక్షల వరకు ఉంటే, మారుతి విక్టోరిస్ ఒక మంచి ఎంపిక.
Toyota Urban Cruiser Hyryder
టయోటా హైరైడర్, మన దేశంలో అత్యంత విశ్వసనీయ హైబ్రిడ్ SUV లలో ఒకటి. మారుతి గ్రాండ్ విటారా ఫ్లాట్‌ఫామ్‌పైనే దీనిని డిజైన్ చేశారు. టయోటా నాణ్యత & విశ్వసనీయ ఇంజినీరింగ్ దీనిని మరింత ప్రత్యేకత ఇచ్చాయి. ఈ కారు.. 1.5-లీటర్, 3-సిలిండర్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజిన్ & e-CVT గేర్‌బాక్స్‌తో జత చేసిన 79 bhp ఎలక్ట్రిక్ మోటారుతో శక్తినిస్తుంది. దీని మొత్తం పవర్ ఔట్‌పుట్ 116 bhp. ఈ SUV సుమారు 27.97 kmpl మైలేజ్ అందిస్తుంది.
ఇంటీరియర్‌లో... 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా & యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ADAS, ఆటో పార్కింగ్ గైడ్ సిస్టమ్, ESP & హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లను కూడా చూడవచ్చు. మీకు విలాసవంతమైన & అధునాతనమైన హైబ్రిడ్ SUV కావాలంటే, టయోటా హైరైడర్ ఓసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి.
Maruti Grand Vitara
మారుతి గ్రాండ్ విటారా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హైబ్రిడ్ SUV. ₹10.77 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో, ఈ SUV అద్భుతమైన ఫీచర్లు & ప్రీమియం ఫీల్ అందిస్తుంది. ఇది 1.5-లీటర్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజిన్ & 79 bhp ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది, e-CVT ట్రాన్స్‌మిషన్ దీనికి యాడ్ అయింది. మైలేజ్ 27.97 kmpl వరకు ఉంటుంది.
Grand Vitara SUV క్యాబిన్‌లో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, PM 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ & క్లారియన్ సౌండ్ సిస్టమ్ వంటి లక్షణాలు ఉన్నాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగులు, పూర్తి డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ & ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇచ్చారు. 2025 అప్‌డేషన్‌తో ఈ SUV E20 ఇంధనానికి అనుకూలంగా మారింది & కొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా జోడించారు. ఫీచర్-లోడెడ్, తక్కువ నిర్వహణ & టెక్-ఫ్రెండ్లీ SUV కోరుకుంటే, మారుతి గ్రాండ్ విటారా మీకు సరైన ఎంపిక.
మారుతి విక్టోరిస్ ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ కారు. టయోటా హైరైడర్ నమ్మదగినది & ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఫీచర్లు & టెక్నాలజీలో గ్రాండ్ విటారా ముందుంది.





















