అన్వేషించండి

Skoda Kushaq : ఈనెల‌లోనే స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు..

Skoda Kushaq: స్కోడా ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరలను మార్చి 21, 2026న వెల్లడించనుంది. సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో వస్తున్న ఈ వాహనం హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనివ్వనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మార్చి 21, 2026న విడుదల అవుతోంది.
  • ఐదు వేరియంట్లలో కారు అందుబాటులో, ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
  • 1.0, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు, కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు లభ్యం.
  • LED లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

 Skoda Kushaq: చెక్ రిప‌బ్లిక్ కు చెందిన‌ కార్ల తయారీ సంస్థ స్కోడా, ఇండియ‌న్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'కుషాక్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. మార్చి 21, 2026న ఈ సరికొత్త మోడల్ ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. 2021లో తొలిసారిగా లాంచ్ అయిన తర్వాత ఈ కారుకు జరుగుతున్న మొదటి భారీ అప్‌డేట్ ఇదే కావడం విశేషం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్చిన డిజైన్ ఎలిమెంట్స్, రిఫ్రెష్డ్ స్టైలింగ్, కొత్త ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

ఈ కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఐదు వేరియంట్లలో లభించనుంది. క్లాసిక్ ప్ల‌స్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే పేర్లతో వీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఎస్‌యూవీ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2026 నుండి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 హెచ్‌పి శక్తిని, 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జతచేశారు. అలాగే శక్తివంతమైన 1.5-లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 150 హెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ అమర్చారు.

అధునాత‌న ఫీచ‌ర్లు..

ఫీచర్ల పరంగా చూస్తే, బేస్ వేరియంట్ నుండి ఎల్‌ఈడీ లైటింగ్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్, అలాయ్ వీల్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ వంటి సెక్యూరిటీ ఫీచ‌ర్లు ఉన్నాయి. వెనుక వైపు వైపర్, డీఫాగర్, అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కారు డిజైనింగ్ స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొందిన‌ట్లు తెలుస్తోంది. ముందు భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, వెనుక వైపు వెలిగే స్కోడా అక్షరాలతో కూడిన కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మాంటే కార్లో వేరియంట్‌లో ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

టెక్నాల‌జీ ప‌రంగా..

టెక్నాల‌జీ విష‌యానికొస్తే గూగుల్ ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. సెగ్మెంట్లోనే మొదటిసారిగా వెనుక సీట్లకు వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్ సౌకర్యం కల్పించారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), పార్కింగ్ సెన్సార్లు వంటివి క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు ఉన్నాయి.. అయితే 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉండకపోవచ్చని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీని ప్రారంభ ధర సుమారు ₹12 లక్షలు ఉండగా, టాప్ వేరియంట్ ₹19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు సవాలు విసరనుంది.

Frequently Asked Questions

కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది?

కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరలను మార్చి 21, 2026న కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. ఏప్రిల్ 2026 నుండి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది.

కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది?

కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఐదు వేరియంట్లలో లభించనుంది: క్లాసిక్ ప్ల‌స్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో.

కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి?

ఇందులో 1.0-లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ (115 హెచ్‌పి) 6-స్పీడ్ మాన్యువల్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అలాగే 1.5-లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ (150 హెచ్‌పి) 7-స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

ఎల్‌ఈడీ లైటింగ్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, వెనుక వైపర్, అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెగ్మెంట్లోనే మొదటిసారిగా వెనుక సీట్లకు వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget