అన్వేషించండి

Tesla Model Y SUV కొన్న రోహిత్ శర్మ - కార్‌ నంబర్‌ 3015 వెనుక ఉన్న సెంటిమెంట్ ఇదే

భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్లా మోడల్ Y SUVని కొనుగోలు చేశారు. 3015 అనే ప్రత్యేక నెంబర్‌తో ఈ ఎలక్ట్రిక్‌ కారును రిజిస్ట్రేషన్‌ చేయించాయి. కారు ధర, ఫీచర్లు, రేంజ్‌ అన్నీ తెలుసుకోండి.

Rohit Sharma Tesla Model Y Features Specifications: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్‌ SUVతో మరోసారి చర్చల్లోకి వచ్చాడు. క్రికెట్ మైదానంలో సిక్సర్లు కొట్టే రోహిత్, ఈసారి ఆటోమొబైల్ ఫ్యాన్స్‌ హృదయాల్లోకి టెస్లా మోడల్‌ Y తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. స్టెల్త్ గ్రే కలర్‌లో ముంబయి వీధుల్లో అతను నడిపిన ఈ కొత్త టెస్లా కారు అందరి చూపును ఆకర్షించింది.

ప్రత్యేక నెంబర్ 3015 వెనుక సెంటిమెంట్

రోహిత్ కొత్త SUV రిజిస్ట్రేషన్‌ నంబర్ “3015”. ఈ నంబర్‌ వెనుక అతనికి ఓ సెంటిమెంట్‌ ఉంది. ఈ అంకెల్లో అతని పిల్లలు సమైరా (30 డిసెంబర్), ఆహాన్ (15 నవంబర్) జన్మదిన తేదీలను మిళితం చేశాడు. మొత్తంగా 3+0+1+5 = 45, అంటే అతని జెర్సీ నెంబర్!. ఈ సెంటిమెంట్‌ను తన లంబోర్గిని ఊరస్ SE మీద కూడా కొనసాగించిన రోహిత్, వ్యక్తిగత భావోద్వేగం, స్టైల్ రెండింటినీ మిళితం చేయడంలో సక్సెస్ అయ్యాడు.

Tesla Model Y ధరలు & వేరియంట్లు

భారత మార్కెట్లో టెస్లా మోడల్ Y రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

Long Range RWD - ₹67.89 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

Standard RWD - ₹59.89 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

ఈ ధరలతో, మోడల్ Y దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత గల్జరీ ఎలక్ట్రిక్‌ SUVలలో ఒకటిగా నిలిచింది.

పనితీరు & రేంజ్

టెస్లా మోడల్ Yలో, 78.1 kWh బ్యాటరీ ఉన్న లాంగ్ రేంజ్ వెర్షన్‌ ఒక్కసారి చార్జ్‌తో 622 km ప్రయాణిస్తుంది. బేస్‌ వెర్షన్‌లోని 60 kWh బ్యాటరీ 500 km వరకు రేంజ్‌ ఇస్తుంది. వేగం విషయంలో కూడా ఇది పవర్‌ఫుల్‌ SUV - 0 నుంచి 100 km  వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో చేరుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 201 km.

లగ్జరీ ఇంటీరియర్‌ ఫీచర్లు

టెస్లా మోడల్ Yలో లోపలి డిజైన్‌ భవిష్యత్ తరహాలో ఉంది:

హీట్‌, వెంటిలేట్‌ అయ్యే ముందు సీట్లు

15.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌

పనోరమిక్ గ్లాస్ రూఫ్‌

9 స్పీకర్ హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్‌

ADAS డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌, వైర్‌లెస్ కనెక్టివిటీ, టూ-జోన్‌ క్లైమేట్ కంట్రోల్‌

ఇంకా ప్రత్యేకంగా కావాలనుకునేవారికి, Full Self-Driving (FSD) ప్యాకేజీని ₹6 లక్షలు అదనంగా చెల్లించి పొందవచ్చు, ఇది సెమీ ఆటానమస్ డ్రైవింగ్‌ సదుపాయాన్ని అందిస్తుంది.

రోహిత్ గ్యారేజ్‌ గ్రీన్ అప్‌డేట్

రోహిత్ గ్యారేజ్‌లో ఇప్పటికే Mercedes-Benz GLS 400d, BMW M5 F1 Edition, Toyota Fortuner, Lamborghini Urus SE ఉన్నాయి. ఇప్పుడు టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్‌ కారు కూడా చేరడంతో అతని గ్యారేజ్‌కి “ఎకో-ఫ్రెండ్లీ టచ్‌” వచ్చింది.

సస్టెయినబుల్‌ డ్రైవింగ్‌కు రోహిత్ మద్దతు

టెస్లా ఎంపికతో రోహిత్ కేవలం స్టైల్‌ కాదు, పర్యావరణ చైతన్యాన్ని కూడా ప్రోత్సహించాడు. సెలబ్రిటీలలో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ కార్లపై ఆసక్తికి అతను ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Telangana News:
"ప్రతి మహిళా సంఘానికో బస్‌- నెలకు 69వేలు అద్దె వచ్చేలా ప్లాన్" మరో సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం 
ED entry in IBOMMA Case: ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
Maoist Dev Ji: మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
Advertisement

వీడియోలు

Maoist Commander Hidma Encounter in AP  | ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ | ABP Desam
KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
CSK Releasing Matheesha Pathirana | పతిరనా కోసం KKR తో CSK డీల్ ?
Kumar Sangakkara as RR Head Coach | రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర
South Africa Captain Temba Bavuma Record | తెంబా బవుమా సరికొత్త రికార్డ్ !
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్  - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ - సంక్రాంతి నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ - అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
Telangana News:
"ప్రతి మహిళా సంఘానికో బస్‌- నెలకు 69వేలు అద్దె వచ్చేలా ప్లాన్" మరో సంచలన నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం 
ED entry in IBOMMA Case: ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
Maoist Dev Ji: మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
Actress Hema: నటి హేమకు మాతృవియోగం... రాజోలులో ఆకస్మిక మరణం
నటి హేమకు మాతృవియోగం... రాజోలులో ఆకస్మిక మరణం
TTD: యువతకు కుటుంబంతో సహా ఉచితంగా బ్రేక్ దర్శనం ఇచ్చే ఆఫర్  ప్రకటించిన టీటీడీ - ఇవిగో డీటైల్స్
యువతకు కుటుంబంతో సహా ఉచితంగా బ్రేక్ దర్శనం ఇచ్చే ఆఫర్ ప్రకటించిన టీటీడీ - ఇవిగో డీటైల్స్
Andhra Maoists: ఏపీని షెల్టర్‌గా మార్చుకుని బుక్కయిన మావోయిస్టులు - 31 మంది అరెస్ట్ - భారీగా డంపులు గుర్తింపు
ఏపీని షెల్టర్‌గా మార్చుకుని బుక్కయిన మావోయిస్టులు - 31 మంది అరెస్ట్ - భారీగా డంపులు గుర్తింపు
Varanasi Movie Budget: వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?
వారణాసి బడ్జెట్ ఎంత? ఇండస్ట్రీలో వచ్చిన పుకార్లు నమ్మొచ్చా? అసలు నిజం ఏమిటంటే?
Embed widget