News
News
వీడియోలు ఆటలు
X

Ford India: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. ఫోర్డ్ ఉద్యోగుల‌కు త్వరలో ఊర‌ట‌!

మ‌న‌దేశంలో కార్ల త‌యారీని నిలిపివేస్తున్న‌ట్లు ఫోర్డ్ ప్ర‌క‌టించింది. దీంతో ఫోర్డ్ చెన్నై యూనిట్లోని 2,600 మంది ఉద్యోగాలు ప్ర‌మాదంలో ప‌డ్డాయి. వీరికోసం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది.

FOLLOW US: 
Share:

ఆటో దిగ్గ‌జం ఫోర్డ్ భార‌త‌దేశంలో కొత్త కార్ల త‌యారీని నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ సంస్థ యూనిట్ల‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల భ‌విష్య‌త్తు డోలాయ‌మానంలో ప‌డింది. చెన్నైలోని ఫోర్డ్ మోటార్ ఫ్యాక్టరీలో 2,600 మంది వ‌ర‌కు ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అయితే వీరికోసం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఒక ముంద‌డుగు వేసింది.

ఈ ప్లాంట్ ను టేకోవ‌ర్ చేసేందుకు ఫోర్డ్, మ‌రో కంపెనీ మ‌ధ్య‌ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు త‌మిళనాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక‌వేళ వారి మ‌ధ్య డీల్ కుదిరితే ఆ స్థ‌లం పంప‌కం సులువుగా జ‌రిగేలా చేస్తామ‌ని పేర్కొంది. గ‌తేడాది ఓలా, మ‌హీంద్రా వంటి కంపెనీల‌తో ఫోర్డ్ ఈ విష‌యంపై చ‌ర్చ‌లు సాగించింది. ఇప్పుడు కూడా అవే కంపెనీల‌తో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయా లేదా ఇవి కొత్త కంపెనీలా అనే విష‌యం తెలియ‌రాలేదు.

ఈ యూనిట్లో మొత్తంగా 2,600 మంది వ‌ర‌కు ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అయితే శుక్ర‌వారం వినాయ‌క చ‌వితి సంబ‌రాల కార‌ణంగా యూనిట్ ను మూసివేశారు. ఫోర్డ్ మాత్రం త‌మ‌కు భార‌త‌దేశాన్ని విడిచి వెళ్లే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేసింది. సోమ‌వారం యాజ‌మాన్యంతో మీటింగ్ ఉంద‌ని, వారేం చెప్తారో అని వేచి చూస్తున్న‌ట్లు ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఉద్యోగుల భ‌విష్య‌త్తు గురించే తాము కూడా ఆలోచిస్తున్న‌ట్లు వారు పేర్కొన్నారు.

Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. ధ‌ర రూ.14 వేల‌లోపే.. రియ‌ల్ మీ సూప‌ర్ ట్యాబ్లెట్!

ఉద్యోగుల కోసం కంపెనీ తీసుకునే నిర్ణ‌యాలు విన‌డానికి తాము ఎదురుచూస్తున్నామ‌న్నారు. ప్లాంట్ ను కొత్త‌ కంపెనీల‌కు అందించి కొన్ని ఉద్యోగాల‌ను అయినా కాపాడితే బాగుంటుంద‌ని వారు అభిప్రాయ‌పడుతున్నారు. కంపెనీ మీద చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలా వ‌ద్దా అనే నిర్ణ‌యం సమావేశం త‌ర్వాత తీసుకుంటామ‌ని తెలిపారు.

చెన్నై న‌గ‌రానికి 45 కిలోమీట‌ర్ల దూరంలోని మ‌రైమ‌లై న‌గ‌ర్ లో ఈ ప్లాంట్ ను ఫోర్డ్ స్థాపించింది. సంవ‌త్స‌రానికి 2 ల‌క్ష‌ల వాహ‌నాల‌ను తయారుచేయగల సామ‌ర్థ్యం ఈ ప్లాంట్ కు ఉంది. ఇందులో ఫోర్డ్ వేల కోట్ల‌ రూపాయల పెట్టుబ‌డుల‌ను పెట్టింది. ఒకానొక ద‌శ‌లో ఇక్క‌డ తయారైన కార్ల‌ను ఫోర్డ్ 37 దేశాల‌కు ఎగుమ‌తి చేసింది.

Also Read: వన్​ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..

దీంతోపాటు ఫోర్డ్ కు గుజ‌రాత్ లోని స‌నంద్ లో కూడా ఇంకో ఫెసిలిటీ ఉంది. ఏటా 2.4 ల‌క్ష‌ల వాహ‌నాల‌ను, 2.7 ల‌క్ష‌ల ఇంజిన్ల‌ను రూపొందించే సామ‌ర్థ్యం ఈ ఫెసిలిటీకి ఉంది. ఇందులో కూడా ఫోర్డ్ భారీగా ఇన్వెస్ట్ చేసింది.  ఫోర్డ్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో 4 వేల మంది ప్ర‌త్య‌క్ష ఉద్యోగుల‌తో పాటు.. కంపెనీకి సంబంధించి వివిధ డీల‌ర్ల వ‌ద్ద ప‌నిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగాలు కూడా ప్ర‌మాదంలో పడ్డాయి.

Published at : 10 Sep 2021 07:02 PM (IST) Tags: Ford Maraimalai Plant Ford Maraimalai Manufacturing Unit Ford Chennai Unit Ford Exit

సంబంధిత కథనాలు

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !