State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
EV Subsidy: ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఒక్కో రాష్ట్రం ఒక్కోలా సబ్సిడీను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సబ్సిడీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
EV Subsidies In India: దేశంలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకుని రాజధాని ఢిల్లీలో డ్రైవింగ్‌కు సంబంధించి అనేక నియమాలను అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ప్రభుత్వం చాలా కాలంగా దేశప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఈవీలను కొనుగోలు చేసేందుకు అనేక రకాల రాయితీలు ఇస్తున్నాయి. దీంతో పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై కూడా ప్రభుత్వం ఆఫర్లను అందిస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీ
ఫేమ్ సబ్సిడీ పథకం కింద దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈవీ విధానాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాల కింద ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై ప్రజలకు ప్రయోజనాలు ఇస్తారు. వివిధ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లపై లభించే ప్రయోజనాల్లో తేడా ఉండవచ్చు.
గుజరాత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ.20,000 వరకు ప్రయోజనాలను అందజేస్తున్నారు. అదే సమయంలో మూడు చక్రాల వాహనాల కొనుగోలుపై రూ.50,000 వరకు, నాలుగు చక్రాల కొనుగోలుపై రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్స్‌ను అందజేస్తున్నారు.
మహారాష్ట్రలో మీరు ద్విచక్ర వాహనం కొనుగోలుపై రూ. 25,000 వరకు మూడు చక్రాల వాహనంపై రూ. 30,000 వరకు, నాలుగు చక్రాల వాహనం కొనుగోలుపై రూ. 2.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
మేఘాలయలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ. 20,000 వరకు, నాలుగు చక్రాల కొనుగోలుపై రూ. 60,000 వరకు ప్రయోజనాలు అందజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల కొనుగోలుపై ఎలాంటి ప్రయోజనం లేదు.
Also Read: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
కర్ణాటకలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఎలాంటి సబ్సిడీ లేదు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి గానూ కంపెనీలకు మాత్రం సబ్సిడీ ఇస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఎలాంటి రాయితీ లేదు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు పన్నులపై మినహాయింపు లభిస్తుంది.
తెలంగాణలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఎలాంటి రాయితీ అందించడం లేదు. కానీ ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు పన్నులపై 100 శాతం మినహాయింపు అందిస్తున్నారు.
తమిళనాడులో రోడ్డు పన్నుపై 100 శాతం రాయితీ ఇస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఈ విధానాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మనదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు సేల్స్ పరంగా దూసుకుపోతున్నాయి. మారుతి సుజుకి కూడా ఈవీఎక్స్ అనే కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చింది. త్వరలో మనదేశంలో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కానున్నాయి. అన్ని కంపెనీలు ఈ విభాగంపై దృష్టి పెడుతున్నాయి.
Also Read: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ కారు వచ్చేసింది - మహీంద్రా బీఈ 6ఈ ధర ఎంత?