అన్వేషించండి

Royal Enfield New Heritage Apparel: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త హెరిటేజ్ కలెక్షన్.. 125 ఏళ్ల చరిత్రను చాటిచెప్పేలా క్లాసిక్ డ్రెస్సులు! ఇక రైడర్ల స్టైలే వేరు

రాయల్ ఎన్‌ఫీల్డ్ 125 ఏళ్ల బైకింగ్ చరిత్రను గుర్తుచేస్తూ కొత్త 'హెరిటేజ్ కలెక్షన్' లైఫ్ స్టైల్ వేర్ని లాంచ్ చేసింది. ఓల్డ్ డిజైన్లు, మోడ్రన్ మెటీరియల్ కలయికతో ఈ అప్పారెల్ రేంజ్ రూపుదిద్దుకుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ 125 ఏళ్ల చరిత్రతో 'హెరిటేజ్ కలెక్షన్' విడుదల.
  • పాత డిజైన్లతో, నేటి ఫ్యాషన్ కు తగ్గట్టుగా దుస్తుల రూపకల్పన.
  • చారిత్రక లోగోలు, స్లోగన్‌లతో ఆధునిక దుస్తుల కలెక్షన్.
  • వారసత్వంతో కూడిన దుస్తులు, ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులో.

Royal Enfield Launches New Heritage Apparel Collection: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కేవలం బైకుల తయారీలోనే కాకుండా, ఫ్యాషన్ రంగంలోనూ తన ముద్రను వేస్తోంది. బ్రాండ్ కు ఉన్న 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను సెలబ్రేట్ చేస్తూ తాజాగా 'హెరిటేజ్ కలెక్షన్' (Heritage Collection) పేరుతో ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ అప్పారెల్ శ్రేణిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. గతంలో ఉన్న పాతకాలపు ఆర్కైవల్ డిజైన్ ఎలిమెంట్లను నేటి తరం మెటీరియల్స్ తో కలిపి ఈ దుస్తులను తయారు చేశారు. ఇవి అటు బైక్ రైడర్లకే కాకుండా, సిటీలో స్టైలిష్ గా కనిపించాలనుకునే ఫ్యాషన్ ప్రియులకు కూడా నచ్చేలా ఉన్నాయి.

డిజైన్ ఫిలాసఫీ..
సిటీ కోసం తయారైనవి.. చరిత్ర నుంచి సంగ్ర‌హించిన‌వి  (Built for the city, rooted in history) అనే కాన్సెప్ట్ తో ఈ కలెక్షన్ రూపొందింది. కాటన్ ట్విల్స్, కాన్వాస్ బ్లెండ్స్, స్ట్రెచ్ మెటీరియల్స్ వంటి నాణ్యమైన బట్టలను ఉపయోగించడం వల్ల ఇవి రోజంతా ధరించినా చాలా కంఫర్ట్ గా ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మెకానికల్ మూలాలను గుర్తుచేస్తూనే, ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా వీటిని డిజైన్ చేశారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉండేలా ఈ బట్టలను కుట్టడం విశేషం.

Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ T4.. బడ్జెట్ కింగ్ ఎవరు? పవర్ ఫుల్ బైక్ ఏది?

చారిత్రక చిహ్నాల కలయిక..
ఈ కలెక్షన్ లో అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. బ్రాండ్ కు ఉన్న ఐకానిక్ హిస్టారికల్ లోగోలను చాలా పద్ధతిగా ఉపయోగించడం. ఎక్కడో పెద్దగా బ్రాండింగ్ కనిపించకుండా, దుస్తుల ఫినిషింగ్ లో చరిత్రను నిక్షిప్తం చేశారు. 1910 నాటి కానన్ లోగో, 1893 లో ప్రాచుర్యం పొందిన "మేడ్ లైక్ ఏ గన్" (Made Like a Gun) స్లోగన్, అలాగే 1969 నాటి సిరీస్ II ఇంటర్సెప్టర్ ట్యాంక్ బ్యాడ్జ్ వంటి వాటిని ప్రింట్లు, ఎంబోసింగ్ పద్ధతుల్లో వాడారు. కలర్ ప్యాలెట్ విషయానికి వస్తే.. మ్యూటెడ్, ఎర్తీ కలర్స్ అంటే గోధుమ, ఆలివ్ గ్రీన్ వంటి సహజమైన రంగులను ఎంపిక చేశారు. దీనివల్ల పాతకాలపు లుక్ రావడంతో పాటు నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటుంది.

Also Read: తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. 154 కి.మీ రేంజ్‌తో త్వరలో మార్కెట్లోకి

కంపెనీ మాటల్లో..
రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ..శతాబ్ద కాలం పైగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ వారసత్వాన్ని ఈ హెరిటేజ్ కలెక్షన్ ద్వారా దుస్తుల రూపంలో కస్టమర్లకు అందిస్తున్నామని తెలిపారు. వాడిన ఫ్యాబ్రిక్ నుండి లోగోల వరకు ప్రతిదీ బ్రాండ్ ప్రయాణాన్ని గుర్తుచేస్తుందని, ఇవి కేవలం గతాన్ని గుర్తు చేసే దుస్తులు మాత్రమే కాదని, నేటి కాలానికి తగ్గట్టుగా మార్చిన ఆధునిక రూపాలు. హస్తకళా నైపుణ్యం, నాణ్యతను కోరుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని తెలిపారు.

Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650కి గట్టి పోటీ! ఏప్రిల్‌ 23న భారత్‌లో బీఎస్‌ఏ స్క్రాంబ్ల్‌ 650 లాంచ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్ అని భావించే అభిమానులకు ఈ హెరిటేజ్ రేంజ్ ఒక గొప్ప అవకాశం. రోజువారీ జీవితంలో కూడా బ్రాండ్ వారసత్వంతో ముడిపడి ఉండేలా ఈ దుస్తులు డిజైన్ చేశారు. రైడింగ్ జాకెట్లు, టీ-షర్టులు, ఇతర యాక్సెసరీలతో ఈ కలెక్షన్ మార్కెట్లో సందడి చేస్తోంది. పాత జ్ఞాపకాలను ఆధునిక ఫ్యాషన్ తో కలిపి ధరించాలనుకునే వారు వీటిని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టోర్లలో చెక్ చేయవచ్చు.

Frequently Asked Questions

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా ఏ కలెక్షన్ విడుదల చేసింది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హెరిటేజ్ కలెక్షన్' పేరుతో కొత్త లైఫ్ స్టైల్ అప్పారెల్ శ్రేణిని విడుదల చేసింది. ఈ కలెక్షన్ బ్రాండ్ 125 ఏళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటుంది.

హెరిటేజ్ కలెక్షన్ డిజైన్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏమిటి?

ఈ కలెక్షన్ 'Built for the city, rooted in history' అనే కాన్సెప్ట్ తో రూపొందించబడింది. ఇది చారిత్రక డిజైన్ ఎలిమెంట్లను ఆధునిక మెటీరియల్స్ తో మిళితం చేస్తుంది.

ఈ దుస్తులలో ఎలాంటి చారిత్రక చిహ్నాలను ఉపయోగించారు?

1910 నాటి కానన్ లోగో, 'మేడ్ లైక్ ఏ గన్' స్లోగన్, 1969 నాటి సిరీస్ II ఇంటర్సెప్టర్ ట్యాంక్ బ్యాడ్జ్ వంటి ఐకానిక్ లోగోలను ప్రింట్లు, ఎంబోసింగ్ పద్ధతుల్లో ఉపయోగించారు.

హెరిటేజ్ కలెక్షన్ లో ఏ రంగులు ఎక్కువగా కనిపిస్తాయి?

గోధుమ, ఆలివ్ గ్రీన్ వంటి మ్యూటెడ్, ఎర్తీ కలర్స్ ను ఉపయోగించారు. ఇవి పాతకాలపు లుక్ తో పాటు నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget