అన్వేషించండి

Royal Enfield Flying Flea C6: తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. 154 కి.మీ రేంజ్‌తో త్వరలో మార్కెట్లోకి

Royal Enfield First Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ బైక్ తీసుకొస్తుంది. నాలుగు రైడింగ్ మోడ్‌లతో్ రహదారి పరిస్థితులకు అనుగుణంగా సెట్ చేసుకునే సిస్టమ్ ఈ బైకులో ఇస్తున్నారు.

భారత్‌లో ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ Royal Enfield మార్పులకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగు పెట్టబోతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ Flying Flea C6ను త్వరలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్టైలిష్, మోడ్రన్, ఎకో-ఫ్రెండ్లీ బైక్‌ను కోరుకునే వారి కోసం ఈ బుల్లెట్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందిస్తున్నారు. దీని డిజైన్ పాత రెట్రో బైక్ లాగా కనిపిస్తుంది. అయితే ఇందులో కొత్త టెక్నాలజీని ఉపయోగించడంతో పాత వాటి కంటే ఇది ప్రత్యేకం కానుంది. మార్కెట్లో ఇదివరకే దీనిగురించి టాక్ నడుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకత దాని పనితీరు, రేంజ్. నివేదికల ప్రకారం, ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీంతో పాటు, ఈ బైక్ చాలా వేగంగా ఉంటుంది. కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని తేలికగా అందుకుంటుంది. ముఖ్యంగా సిటీలో జాబ్ చేసేవారు, లేక బిజినెస్ చేసేవారు రోజువారీ వినియోగానికి ఈ బైక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు 
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 (Royal Enfield Flying Flea C6) బైక్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో చాలా మోడ్రన్  ఫీచర్లు ఇచ్చారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బైక్ దూసుకెళ్తుంది. ఇందులో TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్,  మెసేజ్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు ఉంటాయని అంతా భావిస్తున్నారు. వీటితో పాటు కీలెస్‌ స్టార్ట్, కొత్త తరహా స్విచ్‌లు,  అడ్వాన్స్‌డ్ డిజిటల్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. ఈ ఫీచర్లు ఇతర Royal Enfield బైక్‌ల కంటే ఈ వేరియంట్‌ను ప్రత్యేకం చేయనున్నాయి. ఈ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 బైక్ కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, యూనిక్ లుక్‌తో లాంచ్ చేయనున్నారు.

బైక్ డిజైన్ ఎలా ఉంది?
డిజైన్ విషయానికి వస్తే ఈ బైక్ రెగ్యూలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌ను వాడారు. దీనివల్ల బైక్ స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు తేలికగానూ ఉంటుంది. దీంతో పాటు ఇందులో ప్రత్యేకమైన బ్యాటరీ కేస్, మోడ్రన్ సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. ఇది రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. బైక్‌లో 4 రైడింగ్ మోడ్స్‌తో పాటు 1 కస్టమ్ మోడ్ కూడా ఇచ్చారు. ఈ బైకును మీరు వేర్వేరు రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. బైక్ సీటు ఎత్తు 823 మి.మీ, గ్రౌండ్ క్లియరెన్స్ 207 మి.మీగా ఉండనుంది. 

ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 బైక్ లాంచ్ ఎప్పుడు ?
ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏప్రిల్ 10 భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ ధర సుమారు రూ. 2.5 లక్షల నుండి రూ. 4.5 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ బైక్ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget