అన్వేషించండి

Vehicle Maintenance Guide: మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

వాహనంలోని బ్రేక్ ప్యాడ్స్, టైర్లు, బ్యాటరీ పాడవుతున్నాయని చెప్పే ముందస్తు సంకేతాలను గుర్తించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. వీటిని సకాలంలో మార్చడం వల్ల భారీ ఖర్చులు తప్పుతాయి.

Vehicle Maintenance Guide Warning Signs for Brake Pads Tyres and Battery: ఇండియాలో వాహనం నడపడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. ఇక్కడి విపరీతమైన ట్రాఫిక్, గుంతల రోడ్లు, ఎండలు, వర్షాల వల్ల కారు విడిభాగాలు చాలా త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా బ్రేక్ ప్యాడ్స్, టైర్లు, బ్యాటరీ వంటి కీలక భాగాలు అరిగిపోతున్నప్పుడు కొన్ని సంకేతాలు ఇస్తాయి. చాలామంది వాహనదారులు వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల ప్రయాణంలో భద్రత తగ్గడమే కాకుండా, తర్వాత భారీగా రిపేర్ ఖర్చులు భరించాల్సి వస్తుంది. మీ కారు పార్ట్స్ మార్చాల్సిన సమయం వచ్చిందని చెప్పే ఆ ముందస్తు హెచ్చరికలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బ్రేక్ ప్యాడ్స్ - చిన్న శబ్దం వస్తున్నా జాగ్రత్త..
కారు ఆపేటప్పుడు వింత శబ్దాలు రావడం బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయని చెప్పడానికి మొదటి సంకేతం. బ్రేక్ వేసినప్పుడు కిర్రుమనే శబ్దం రావడం, బ్రేక్ పెడల్ నొక్కినప్పుడు వైబ్రేషన్స్ రావడం లేదా కారు వెంటనే ఆగకపోవడం వంటివి జరిగితే వెంటనే చెక్ చేయించాలి. బ్రేక్ ప్యాడ్స్ మందం 3 ఎంఎం కంటే తక్కువగా ఉంటే అవి పనికిరావు. కొన్ని కొత్త కార్లలో డ్యాష్‌బోర్డ్ మీదే దీనికి సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. వీటిని పట్టించుకోకపోతే బ్రేక్ డిస్కులు పాడయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్రేక్ ప్యాడ్లను 25,000 నుండి 40,000 కిలోమీటర్ల మధ్యలో మార్చడం మంచిది.

టైర్లు, గ్రిప్ తగ్గుతోందా?
రోడ్డుపై కారు పట్టు కోల్పోకుండా ఉండాలంటే టైర్లు బాగుండాలి. టైర్ల మీద ఉండే గీతలు (Tread) 1.6 ఎంఎం కంటే తక్కువగా ఉంటే ఆ టైర్లు వాడటం ప్రమాదకరం. టైర్ల మీద పగుళ్లు రావడం, బుడిపెలు కనిపించడం లేదా టైర్లలో గాలి పదేపదే తగ్గిపోతుండటం వంటివి అరిగిపోయిన టైర్ల లక్షణాలు. ముఖ్యంగా వర్షాకాలంలో అరిగిపోయిన టైర్ల వల్ల కారు స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. టైర్ల జీవితకాలం సాధారణంగా 40,000 నుండి 60,000 కిలోమీటర్లు లేదా 4 నుండి 5 ఏళ్లు మాత్రమే ఉంటుంది. టైర్ రొటేషన్, వీల్ అలైన్‌మెంట్ క్రమం తప్పకుండా చేయించడం వల్ల ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి.

బ్యాటరీ , స్టార్టింగ్ లో ట్రబుల్ ఇస్తోందా?
కారు స్టార్ట్ చేసేటప్పుడు ఇంజిన్ స్లోగా తిరుగుతున్నట్లు అనిపించినా, హెడ్ లైట్స్ వెలుతురు తగ్గినా బ్యాటరీ వీక్ అయిందని అర్థం. బ్యాటరీ టెర్మినల్స్ మీద తుప్పు పట్టడం, డ్యాష్‌బోర్డ్ లో బ్యాటరీ వార్నింగ్ లైట్ వెలగడం వంటివి ప్రధాన సంకేతాలు. చాలా బ్యాటరీల లైఫ్ 3 నుండి 5 ఏళ్లు మాత్రమే. ఈ సమయం దాటిన తర్వాత బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దీనివల్ల ప్రయాణం మధ్యలో కారు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. విపరీతమైన వేడి, తేమ వంటి వాతావరణ పరిస్థితులలో బ్యాటరీ మరింత త్వరగా డిశ్చార్జ్ అవుతుంది.

మొయింట‌నెన్స్ చిట్కాలు..
వాహన భాగాల ఆయుష్షు పెరగాలంటే డ్రైవింగ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి. హఠాత్తుగా బ్రేకులు వేయడం, అతి వేగంగా వెళ్లడం వంటివి తగ్గించాలి. టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి. కారును ఎక్కువ కాలం వాడకుండా వదిలేయడం వల్ల కూడా బ్యాటరీ పాడవుతుంది. ఎప్పటికప్పుడు ఈ ముందస్తు హెచ్చరికలను గమనిస్తూ, వెంటనే సర్వీసింగ్ చేయించడం వల్ల భారీ ఖర్చులు తగ్గించుకోవచ్చు. భద్రతతో కూడిన ప్రయాణం కోసం మీ వాహనాన్ని ఎప్పుడూ కండిషన్ లో ఉంచుకోవడం ఉత్తమం.

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget