అన్వేషించండి

కొత్త ఏడాది ప్రారంభం నుంచే షాక్ - Renault Kwid, Triber, Kiger ధరలు పెంపు

రెనాల్ట్ ఇండియా, 2026 జనవరి నుంచి Kwid, Triber, Kiger కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెంపునకు కారణాలు, ప్రస్తుత ధరలపై పూర్తి వివరాలు ఇవిగో.

Renault Kwid new price 2026: కొత్త ఏడాది 2026 ప్రారంభం నుంచే కారు కొనుగోలుదారులకు రెనాల్ట్ ఇండియా షాక్ ఇవ్వనుంది. 2026 జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ఈ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల పెంపు గరిష్ఠంగా 2 శాతం వరకు ఉండనుందని రెనాల్ట్ స్పష్టం చేసింది. అయితే ఈ పెంపు అన్ని మోడళ్లకు, అన్ని వేరియంట్లకు ఒకేలా ఉండదని కూడా తెలిపింది.

ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలతో పాటు ప్రస్తుత మాక్రో ఎకనామిక్ పరిస్థితులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా రెనాల్ట్‌ పేర్కొంది. ముడి పదార్థాల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, తయారీ వ్యయాలు పెరగడం వల్ల రేట్ల రివిజన్‌ తప్పనిసరి అయిందని అధికారిక ప్రకటనలో వివరించింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో రెనాల్ట్ లైనప్

ప్రస్తుతం రెనాల్ట్ ఇండియా మూడు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. అవి Kwid, Triber, Kiger. వీటిలో ఎంట్రీ లెవల్ కారుగా Kwid కొనసాగుతోంది. ప్రస్తుతం Kwid ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹4.29 లక్షల నుంచి ₹5.99 లక్షల వరకు ఉంది. ధరల పెంపు తర్వాత కూడా Kwid రెనాల్ట్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత అందుబాటు ధర కారు గానే కొనసాగనుంది.

Triber విషయానికి వస్తే, ఇది ఒక కాంపాక్ట్ MPVగా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹5.76 లక్షల నుంచి ₹8.59 లక్షల వరకు ఉంది. కుటుంబ వినియోగానికి సరిపోయే స్పేస్‌, ఫ్లెక్సిబుల్ సీటింగ్ వల్ల Triberకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.

రెనాల్ట్ ఇండియా లైనప్‌లో టాప్ మోడల్‌గా Kiger కాంపాక్ట్ SUV నిలుస్తోంది. దీని ప్రస్తుత ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹5.76 లక్షల నుంచి ₹10.33 లక్షల వరకు ఉంది. SUV తరహాలో ఉండే డిజైన్‌, టర్బో పెట్రోల్ ఆప్షన్‌లతో Kiger యువ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

ధరల పెంపు ఎలా ఉండబోతోంది?

రెనాల్ట్ తెలిపిన ప్రకారం, ధరల పెంపు అన్ని మోడళ్లలో ఒకేలా ఉండదు. వేరియంట్‌, మోడల్‌ను బట్టి పెంపు శాతం మారుతుంది. కొత్త ధరల వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు. అంటే, ఇప్పుడు కొనుగోలు చేసేవారికి ఇంకా కొంత సమయం ఉంది, పాత రేట్లతోనే కారు బుక్‌ చేసుకోవచ్చు.

GST తర్వాత తగ్గిన ధరలకు చెక్

ఇటీవల కొత్త GST మార్పుల నేపథ్యంలో రెనాల్ట్ కొన్ని మోడళ్లపై ఎక్స్‌-షోరూమ్‌ ధరలను తగ్గించింది. కస్టమర్‌ దృష్టితో చూస్తే, GST వల్ల వచ్చే ప్రయోజనం ఇప్పుడు ప్రకటించిన ధరల పెంపు కారణంగా కొంతవరకు తగ్గుతుంది. అంటే కస్టమర్‌కు అప్పట్లో వచ్చిన రిలీఫ్‌, ఇప్పుడు కొంత మేర తగ్గినట్లే అవుతుంది.

జనవరి 2026లో కొత్త రెనాల్ట్ డస్టర్

ధరల పెంపుతో పాటు మరో కీలక విషయం కూడా ఉంది. రెనాల్ట్ ఇండియా, జనవరి 2026లో కొత్త తరం డస్టర్ SUVని భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా నిర్ధారించింది. ఇప్పటికే కంపెనీ మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో వెనుక భాగం డిజైన్‌కు సంబంధించిన ఒక చిన్న లుక్‌ మాత్రమే చూపించారు.

అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా యూరప్‌లో, ఈ మోడల్ ఇప్పటికే Dacia Duster పేరుతో అమ్మకాల్లో ఉంది. భారత మార్కెట్‌కు వచ్చే డస్టర్‌పై మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

2026లో రెనాల్ట్ కార్ కొనాలనుకునే వారు ధరల పెంపును దృష్టిలో పెట్టుకుని ఈ రోజే ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే, కొత్త డస్టర్ కోసం ఎదురుచూసే వారికి వచ్చే ఏడాది ప్రారంభం ఆసక్తికరంగా ఉండబోతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు
రూ.8.14 లక్షలకే Hyundai Exter Knight Edition.. బ్లాక్ లుక్‌తో మెరిసిపోతున్న కొత్త అవతార్‌
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో కొత్త 'నైట్‌ ఎడిషన్‌' - కేవలం రూ.15,000 కే స్పోర్టీ లుక్, ఆల్ బ్లాక్ క్యాబిన్
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget