అన్వేషించండి

వైర్‌లెస్‌ కార్‌ప్లే నుంచి ఫ్యూయల్‌ మైలేజ్‌ వరకు - హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ నిజ జీవిత అనుభవం

17,500 కిలోమీటర్ల లాంగ్‌ టర్మ్‌ వాడకంలో హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ అనుభవం ఎలా ఉంది? వైర్‌లెస్‌ కార్‌ప్లే అప్‌గ్రేడ్‌, మైలేజ్‌, సర్వీస్‌ ఖర్చులపై పూర్తి రిపోర్ట్‌.

Hyundai Creta N Line Review: హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ కొని, ముంబై ట్రాఫిక్‌లో 17,500 కిలోమీటర్లు నడిపిన ఒక ఓనర్‌ ఇచ్చిన నిజ జీవితపు రిపోర్ట్‌ ఇది. ఈ కారుతో అతని అనుభవాన్ని ఆ వ్యక్తి మాటల్లోనే తెలుసుకుందాం. కొత్తగా కారు కొనేవాళ్లకు ఈ రివ్యూ తప్పకుండా ఉపయోగపడుతుంది.

"పండుగల సీజన్‌ మొదలవ్వగానే నా లాంగ్‌ టర్మ్‌ హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌కు ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ చేశాను. హ్యుందాయ్‌ USB డాంగిల్‌ కొన్నాను. చిన్నదే అయినా, ప్రతిరోజూ ఉపయోగంలో పెద్ద మార్పు తీసుకొచ్చే అప్‌గ్రేడ్‌ ఇది. ఈ హ్యుందాయ్‌ USB డాంగిల్‌... వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto సపోర్ట్‌ చేస్తుంది.

ఈ యాక్సెసరీ కోసం కొన్ని నెలలుగా వెతుకుతున్నాను. ఎప్పుడూ స్టాక్‌లో లేకపోవడంతో ఆలస్యం అయింది. ఎట్టకేలకు దొరికింది. చెప్పాలంటే, దీని కోసం చేసిన రూ.4,500 ఖర్చు పూర్తిగా విలువైనదే. ఎలాంటి ల్యాగ్‌, గ్లిచ్‌లు లేకుండా వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఇస్తోంది. ఇక ఫోన్‌ కనెక్ట్‌ చేయడానికి కేబుల్‌ అవసరం లేకపోవడం రోజువారీ డ్రైవ్‌ను మరింత సులభం చేసింది. ఫోన్‌ బ్యాటరీ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటుందని అనిపిస్తోంది.

మైలేజ్‌ విషయంలో మాత్రం నిరాశ
ఇంత మంచి అప్‌గ్రేడ్‌ తర్వాత కూడా ఫ్యూయల్‌ మైలేజ్‌ సమస్య మాత్రం అలాగే ఉంది. పెట్రోల్‌లో ఎథనాల్‌ శాతం పెరగడం కారు మైలేజ్‌పై ప్రభావం చూపుతుందన్న అనుమానం నాకు ఉంది. ఇప్పుడు దానికి స్పష్టమైన ఆధారం దొరికింది. ఇటీవల నేను చేసిన ఒక టెస్ట్‌లో... E10 ఫ్యూయల్‌తో 12.12 kmpl మైలేజ్‌ ఇచ్చింది, E20 ఫ్యూయల్‌తో 10.59 kmpl మాత్రమే మైలేజ్‌ ఇచ్చింది. అంటే దాదాపు 12 శాతం మైలేజ్‌ తగ్గింది. నా రోజువారీ ప్రయాణం చిన్నది, ట్రాఫిక్‌తో కూడుకున్నది కావడంతో మైలేజ్‌ మరింత తగ్గి సుమారు 8 kmpl వద్దే ఆగింది. నిజం చెప్పాలంటే ఇది కాస్త గట్టి దెబ్బే. రోజూ ఎక్కువ ట్రాఫిక్‌లో తిరిగేవాళ్లకు దాదాపుగా ఇదే పరిస్థితి ఉండొచ్చు.

మధ్యలో చిన్న సమస్య
కొంతకాలం తర్వాత, కారు టైరు పంక్చర్‌ అయింది. అంతేకాదు, ఒకరోజు అకస్మాత్తుగా కారు డిజిటల్‌ డిస్‌ప్లేలో ఎన్నో వార్నింగ్‌లు కనిపించాయి. వెంటనే దగ్గరలోని హ్యుందాయ్‌ వర్క్‌షాప్‌ను సంప్రదించాను. మరుసటి రోజే స్లాట్‌ ఇచ్చారు. ఆ పరిశీలనలో, వైరింగ్‌ దెబ్బతినడం కారణమని గుర్తించారు. ముంబైలో ఎలుకల సమస్య ఇది. వైర్లు చక్కగా రిపేర్‌ చేసి, అదే రోజున కారు ఇంటికి పంపించారు. ఖర్చు కేవలం రూ.1,700 మాత్రమే. గతంలో నా వెర్నాకు కూడా ఇదే సమస్య వచ్చింది. 

రోజువారీ వాడకంలో అనుభవం
ఈ చిన్న సంఘటనలు తప్పితే, క్రెటా N లైన్‌ ఇప్పటికీ నన్ను నిరాశపరచలేదు. లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది (సౌండ్‌ మాత్రం అంత స్పోర్టీగా లేదు). కుటుంబానికి సరిపడే స్థలం ఉంది. అన్ని ఫీచర్లు నమ్మకంగా పని చేస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 360 డిగ్రీ కెమెరాలు. ఇవి డ్రైవింగ్‌, పార్కింగ్‌ సమయంలో అద్భుతమైన విజువల్‌ క్లారిటీ ఇస్తున్నాయి.

గతంలో చాలా మోడళ్లను నడిపిన అనుభవం నాకు ఉంది. ఆ అనుభవంతో చెబుతున్నాను - హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ను డ్రైవ్‌ చేసినప్పుడు సంతోషంగా అనిపించింది. 

కీలక విషయాలు:

హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ (ఎక్స్‌-షోరూమ్‌) ధర: రూ.20.09 లక్షలు
ఈ రివ్యూ ఇచ్చే సమయానికి తిరిగిన దూరం: 17,716 కిలోమీటర్లు
సగటు మైలేజ్‌: 7.9 kmpl
మెయింటెనెన్స్‌ ఖర్చు: వైరింగ్‌ రిపేర్‌ – రూ.1,700
లోపాలు: ఇప్పటి వరకు లేవు

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget