X

Porsche: లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసిన పోర్షే.. ఏకంగా 450 కిలోమీటర్ల రేంజ్.. ధర ఎంతంటే?

ఆటోమొబైల్ బ్రాండ్ పోర్షే రెండు కొత్త కార్లను మనదేశంలో లాంచ్ చేసింది.

FOLLOW US: 

పోర్షే మనదేశంలో రెండు కార్లను లాంచ్ చేసింది. వీటిలో ఒకటి కొత్త మకాన్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కాగా, రెండోది టేకాన్ ఎలక్ట్రిక్ క్రాస్ టురిస్మో/స్పోర్ట్స్ సెడాన్. ఇందులో మకాన్ మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ. దానికి కొన్ని అప్‌గ్రేడ్స్ చేసి దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చిన మకాన్ రేంజ్‌లో మకాన్, మకాన్ ఎస్, మకాన్ జీటీఎస్ కార్లు ఉన్నాయి.

మకాన్ జీటీఎస్‌లో 195 కేడబ్ల్యూ టర్బో చార్జ్‌డ్ 4 సిలిండర్ ఇంజిన్ అందించారు. మకాన్ ఎస్‌లో 2.9 లీటర్ వీ6 డెవలపింగ్ 280 కేడబ్ల్యూ అయితే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.6 సెకన్లలోనే అందుకోగలదు. అన్నిటికంటే వేగవంతమైన మకాన్ జీటీఎస్‌లో 2.9 లీటర్ వీ6 ఇంజిన్ అందించారు. దీని టాప్ స్పీడ్ 272 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో సెవన్ స్పీడ్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లు ఉన్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

దీని ఎక్స్‌టీరియర్‌లో కూడా పలు మార్పులు చేశారు. ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌ను ఇందులో అందించారు. ఈ కొత్త మకాన్ ధర రూ.83.21 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అయితే ముందు వెర్షన్‌తో పోలిస్తే మరింత స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌ను ఇందులో అందించారు.

టేకాన్‌తో పాటు టేకాన్ క్రాస్ ట్యురిస్మోను కూడా లాంచ్ చేశారు. పోర్షే లాంచ్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు టేకాన్‌నే. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. 93.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. ఇందులో మొత్తం నాలుగు టచ్ యూనిట్లు ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌లో ఎయిర్ సస్పెన్షన్, బోస్ ఆడియో సిస్టం వంటి ఫీచర్లు అందించారు.

టేకాన్‌లో మరో వేరియంట్ కూడా లాంచ్ అయింది. ఇందులో 79.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 20 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ 80 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. స్టాండర్డ్ వేరియంట్ అయితే 80 శాతం చార్జ్ కావడానికి 1.5 గంటల సమయం పడుతుంది. ఇందులో టర్బో ఎస్ మోడల్ 2.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.1.5 కోట్ల నుంచి ప్రారంభం కానుంది.

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!

Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!

Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: New Electric Car Porsche Taycan Porsche Macan Porsche Macan S Porsche Macan GTS Porsche Electric Car Porsche New Car Porsche

సంబంధిత కథనాలు

Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

New Suzuki Alto: సుజుకీ కొత్త ఆల్టో ఇదే.. అదిరిపోయే డిజైన్.. లాంచ్ ఎప్పుడంటే?

New Suzuki Alto: సుజుకీ కొత్త ఆల్టో ఇదే.. అదిరిపోయే డిజైన్.. లాంచ్ ఎప్పుడంటే?

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?

GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?

Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!

టాప్ స్టోరీస్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు