Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!
ఓలా ఎలక్ట్రిక్ కారు మనదేశంలో ఆగస్టు 15వ తేదీన లాంచ్ కానుంది.
ఓలా తన ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయనుంది. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. తాజాగా కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ కూడా ఈ కారుకు సంబంధించిన వివరాలను టీజ్ చేశారు. ఇందులో కొత్త తరం ఎలక్ట్రిక్ బ్యాటరీలను కంపెనీ అందించనుంది.
మూడు బాడీ స్టైల్స్‌తో
ఈ కారుకు సంబంధించిన మొదటి టీజర్ వీడియోను కంపెనీ షేర్ చేసినప్పుడు మొత్తం మూడు బాడీ స్టైల్స్‌ను కంపెనీ టీజ్ చేసింది. అవే కూప్, సెడాన్, ఎస్‌యూవీ మోడల్స్. వీటిని బట్టి చూస్తే ఓలా వీటిలో ఒక మోడల్ లేదా మూడిటినీ లాంచ్ చేసే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీస్ం హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయినా లాంచ్ అవుతుంది.
కొత్త తరం బ్యాటరీ
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఈ కారులో ఉపయోగించే 2170 లిథియం ఇయాన్ బ్యాటరీలను రివీల్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ కార్లలో ఈ బ్యాటరీలనే కంపెనీ ఉపయోగించే అవకాశం ఉంది.
ఖర్చు తక్కువ
బ్యాటరీలను కూడా ఓలా సొంతంగానే రూపొందించుకుంటుంది కాబట్టి, ఈ కారు తయారీకి అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉండనుంది. దీని ప్రభావం కార్ల ధర మీద కూడా పడనుంది. కాబట్టి కారు ఎక్స్-షోరూం ధరలు కూడా తక్కువగానే ఉండవచ్చు.
500 కిలోమీటర్ల వరకు రేంజ్
ఈ కారులో రేంజ్‌ను కూడా ఓలా ఎక్కువగా అందించనుందని వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందించే విధంగా ఓలా వీటిని డిజైన్ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీని పవర్, టార్క్ అవుట్ పుట్ వివరాలు తెలియాల్సి ఉంది.
వావ్ అనిపించే ఫీచర్లు కూడా
ఓలా ఎలక్ట్రిక్ కార్లలో మంచి ఫీచర్లు ఉండనున్నాయిని తెలుస్తోంది. అడ్వాన్స్‌డ్ డ్రైవ్ అసిస్ట్ సిస్టం (ఏడీఏఎస్) ఫీచర్‌ను కంపెనీ ఇప్పటికే ప్రివ్యూ చేసింది. దీని ధరలో అందుబాటులో ఉండనున్న కార్ల కంటే దీన్ని ఒక మెట్టు పైనే ఉంచే ఫీచర్లను ఓలా ఇందులో అందించనుంది.
పోటీ ఎవరితో
ఓలా ఎలక్ట్రిక్ ధరలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ400లతో ఓలా ఎలక్ట్రిక్ కారు పోటీ పడనుంది. వీటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఇంకా లాంచ్ కావాల్సి ఉంది.
ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించడం ఒక విషయం అయితే ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం ఇంకా కష్టమైన అంశం. ఓలా ఎలక్ట్రిక్ కారు వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక స్కూటర్ల విభాగంలో ఓలా ఎస్1కు చాలా హైప్ వచ్చింది. సేల్స్‌లో కూడా పోటీ స్కూటర్లను దాటి ఓలా ముందుకు దూసుకుపోయింది. కార్లలో ఇప్పటికే పోటీ విపరీతంగా ఉంది. ఎంతో పేరున్న ప్రముఖ బ్రాండ్లు కూడా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కారు వీటికి పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటుందేమో చూడాలి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?