Hydrogen Car : దేశంలో ఇక హైడ్రోజన్ కార్లు - కిలో మీటర్ ఖర్చు రూ. రెండే !
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్ కారులో పార్లమెంట్‌కు వచ్చారు. దేశంలో హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహిస్తామని ఆయన ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రావడం అనేది అసాధ్యంగా మారిపోయింది. అందుకే ప్రత్యామ్నాయంగా ఎక్కువగా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తున్నారు. అందుకే రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం అంటున్నారు. కానీ ఆ విప్లవం రాక ముందే మరో ప్రత్యామ్నాయ ఇంధనంతో వాడే కార్లు తెరపైకి వచ్చాశాయి. అవే హైడ్రోజర్ కార్లు. దేశంలో తొలి హైడ్రోజన్ కారు మిరాయ్‌ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొన్నారు. ఆ కారులోనే పార్లమెంట్‌కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
Delhi | Union Road Transport & Highways minister Nitin Gadkari rides in a green hydrogen-powered car to Parliament pic.twitter.com/ymwtzaGRCm
— ANI (@ANI) March 30, 2022
హైడ్రోజన్ కారులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారు ఫుల్ ట్యాంక్‌పై 600 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ కారుతో ప్రయాణ ఖర్చు కిలోమీటరుకు కేవలం రూ. 2కి తగ్గుతుంది. దీంట్లో ఇంధన నింపటానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది. గడ్కరి కొన్న కారు పేరు ‘మిరాయ్’. అంటే దీని అర్థం భవిష్యత్తు అని. ఇంధనాల విషయంలో స్వయం స్వావలంభన సాధించే విధంగా ఈ మిరాయ్ ఉండనుందని నితిన్ గడ్కరీ చెబుతున్నారు .
Green Hydrogen ~ An efficient, ecofriendly and sustainable energy pathway to make India 'Energy Self-reliant' pic.twitter.com/wGRI9yy0oE
— Nitin Gadkari (@nitin_gadkari) March 16, 2022
షాకింగ్ ! సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై పెట్రో బాంబులతో మహిళ దాడి, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
సిటీల్లో మురుగునీరు, ఘన వ్యర్థాలను ఉపయోగించి బస్సులు, ట్రక్కులు, కార్లలో గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించాలని గడ్కరీ చెబుతున్నారు. ఈ ప్రకారం భారత ప్రభుత్వం రూ. 3000 కోట్లలో ఈ మిషన్ ప్రారంభించిందని…త్వరలోనే హైడ్రోజన్ ఎగుమతి చేసే దేశంగా మారుతుందని చెబుతున్నారు. భారత్ ఆత్మనిర్భర్ కావడానికి… నీటి నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రవేశపెట్టామని ప్రకటించారు. ఈ ‘ మిరాయ్’ కారు పైలెట్ ప్రాజెక్ట్ మాత్రేనని.. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ తయారీని ప్రారంభించి పెట్రోల్ వంటి ఇంధన దిగుమతులను అరికడతామని మంత్రి గడ్కరి అన్నారు.
50 ఏళ్ల వ్యక్తి - పాతికేళ్ల యువతి పెళ్లి చేసుకోవడం గుర్తుందా? 5 నెలలకే వారి కాపురంలో ఊహించని ఘటన!
జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే వాహనాన్ని గడ్కరీకి ప్రత్యేకంగా అందించి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న సమయంలో ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలని కేంద్రం ప్రచారం చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం ఇస్తోంది. హైడ్రోజన్ కార్లు కూడా సక్సెస్ అయితే.. దేశలో తిరుగులేని ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు తెరపైకి వచ్చినట్లే అనుకోవచ్చు.