Tumakuru Marriage: 50 ఏళ్ల వ్యక్తి - పాతికేళ్ల యువతి పెళ్లి చేసుకోవడం గుర్తుందా? 5 నెలలకే వారి కాపురంలో ఊహించని ఘటన!
Tumakuru Husband Death: పెళ్లి జరిగిన 5 నెలలకు అంటే ఇప్పుడు ఓ కుక్కను పెంచుకోవడంపై భార్యాభర్తలు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
![Tumakuru Marriage: 50 ఏళ్ల వ్యక్తి - పాతికేళ్ల యువతి పెళ్లి చేసుకోవడం గుర్తుందా? 5 నెలలకే వారి కాపురంలో ఊహించని ఘటన! Tumakuru: fifty years old Shankarappa who marries 25 years old woman suicides due to wife harassment Tumakuru Marriage: 50 ఏళ్ల వ్యక్తి - పాతికేళ్ల యువతి పెళ్లి చేసుకోవడం గుర్తుందా? 5 నెలలకే వారి కాపురంలో ఊహించని ఘటన!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/ac3fc89c677ba69d2a60119b13f51663_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka Marriage: కర్ణాటకలో గత ఏడాది అక్టోబరులో జరిగిన ఓ వివాహం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. శంకరప్ప అనే 50 ఏళ్ల వ్యక్తి పాతికేళ్ల అమ్మాయి ఇద్దరూ పరస్ఫర అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. 25 ఏళ్ల మేఘన అనే యువతి శంకరప్ప వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ, శంకరప్ప అప్పటికి ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ యువతి కోరిక మేరకు శంకరప్ప ఆ అమ్మాయిని సమీపంలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటూ దండలు మార్చుకున్న ఫోటోలు వీడియోలు గత అక్టోబరులో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. 50 ఏళ్ల పెద్దాయన ఆయన వయసులో సగం వయసు ఉన్న చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటని ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఈ వివాహం వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లి జరిగిన 5 నెలలకు అంటే ఇప్పుడు ఓ కుక్కను పెంచుకోవడంపై భార్యాభర్తలు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ విషయంలో శంకరప్ప తన తల్లి మాటకు కట్టుబడి ఉండిపోయాడు. భర్త తీరుతో మనస్తాపానికి గురైన భార్య శంకరప్పను అనుచిత పదజాలంతో దూషించింది. ఆ కుక్క వ్యవహారం ఇద్దరి మధ్య గొడవలను మరింతగా పెంచింది. భార్య అసభ్య పదజాలంతో తిట్టడంతో ఆ మాటలకు మనస్తాపం చెందిన శంకరప్ప ఇల్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్యతో పాటు బంధువులు వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో వారి ఇంటి సమీపంలోని ఓ తోటలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దాన్ని శంకరప్ప శవంగా గుర్తించారు.
అతను అక్కడే ఉన్న జామ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందులో కుటుంబ సమస్యలతో శంకరప్ప ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరెవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. శంకరప్ప స్వస్థలం కర్ణాటకలోని తుమకూరు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా హులియూర్ దుర్గలోని అక్కరి పాళ్యలో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు.
50 ఏళ్ల వ్యక్తి గత ఏడాది అక్టోబర్‌లో 25 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియా సైట్లలో వైరల్‌గా మారింది. వీరి పెళ్లి వీడియోలు, ఫొటోలు విరివిగా షేర్ అయ్యాయి. పెళ్లి జరిగిన తర్వాత శంకరప్ప తన భార్యతో సంతోషంగా జీవించేవాడు. భార్య కోరిక మేరకు ఇద్దరూ డ్యూయెట్లు పాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేసేవాడు. చివరికి ఇలా చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)