News
News
X

CRPF Camp: షాకింగ్ ! సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై పెట్రో బాంబులతో మహిళ దాడి, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

Petrol Bomb Attack At CRPF Camp In Sopore: ఓ మహిళ ఏకంగా సీఆర్పీఎఫ్ క్యాంప్ మీద బాంబు దాడికి పాల్పడింది. సోపోర్‌లో మంగళవారం రాత్రి పెట్రో బాంబులతో దాడి చేయడం కలకలం రేపింది.

FOLLOW US: 

Petrol Bomb Attack At CRPF Camp In Sopore: జమ్మూకాశ్మీర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బురఖా ధరించిన ఓ మహిళ ఏకంగా సీఆర్పీఎఫ్ క్యాంప్ మీద బాంబు దాడికి పాల్పడటం కలకలం రేపింది. సోపోర్‌లో మంగళవారం రాత్రి పెట్రో బాంబులతో దాడి చేసి, వెంటనే అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన అంతా క్యాంప్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ్ చేసింది. మహిళ చేసిన పెట్రో బాంబు దాడి (Woman Hurls Petrol Bomb At CRPF Camp)తో అప్రమత్తమైన అధికారులు అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారులకు భద్రతా సిబ్బంది సమాచారం అందించగా, స్థానికంగా కార్డన్ సెర్చ్ చేసి నిందితురాలిని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. బురఖా ధరించడంతో దాడి చేసిన వ్యక్తిని గుర్తించడం భద్రతా సిబ్బందికి కష్టతరంగా మారినట్లు కనిపిస్తోంది.

అసలేం జరిగింది..
అది జమ్మూకాశ్మీర్ లోని సోపోర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్. మంగళవారం సాయంత్రం అప్పటివరకూ ప్రశాంతంగా ఉంది. దాదాపు రాత్రి 7 గంటల ప్రాంతంలో బురఖా ధరించిన ఓ మహిళ సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చింది. వస్తూనే అనుమానాస్పదంగా కనిపించిన మహిళ తన బ్యాగులో ఏదో వస్తువుల కోసం వెతికినట్లు కనిపించింది. అంతలోనే బ్యాగులో నుంచి పెట్రోల్ బాంబులు తీసి సీఆర్పీఎఫ్ క్యాంప్ గేటు వైపు విసిరి దాడికి పాల్పడింది. అనంతరం అక్కడి నుంచి మహిళ పరారైనట్లు సీసీటీవీలో రికార్డైనట్లు అధికారులు తెలిపారు.

స్థానికులు భయాందోళన..
సీఆర్పీఎఫ్ క్యాంప్ గేటు వచ్చిన వచ్చిన మహిళ పెట్రో బాంబులతో దాడి చేయడంతో రోడ్లపై ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలు సంభవించిన వెంటనే ఆర్పేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది బకెట్లలో నీళ్లు తెచ్చారు. పెట్రో బాంబుల ప్రభావం అంతగా లేకపోవడంతో త్వరగానే మంటల్ని ఆర్పేశారు. అయితే ఓ మహిళ వచ్చి పెట్రో బాంబులు వేసిందంటే, ఒకవేళ రెబల్స్, ఉగ్రమూకలు బాంబులతో దాడిచేస్తే పరిస్థితి ఏంటని.. వారి భద్రతపై స్థానికుల నుంచి అనుమానాలు రెట్టింపయ్యాయి.

Also Read: Tumakuru Marriage: 50 ఏళ్ల వ్యక్తి - పాతికేళ్ల యువతి పెళ్లి చేసుకోవడం గుర్తుందా? 5 నెలలకే వారి కాపురంలో ఊహించని ఘటన!

Also Read: Pithapuram Missing Case : పిఠాపురం యువతి మిస్సింగ్ కేసులో ట్వీస్ట్, బస్సులో ఎక్కిన సీసీ విజువల్స్ లభ్యం!

Published at : 30 Mar 2022 09:32 AM (IST) Tags: sopore jammu and kashmir crpf Petrol Bomb At CRPF Camp Petrol Bomb

సంబంధిత కథనాలు

దుర్గం చెరువులో దూకిన యువతి, 24 గంటల తర్వాత మృతదేహం లభ్యం!

దుర్గం చెరువులో దూకిన యువతి, 24 గంటల తర్వాత మృతదేహం లభ్యం!

నారా బ్రాహ్మిణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని కొట్టిన టీడీపీ లీడర్లు!

నారా బ్రాహ్మిణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని కొట్టిన టీడీపీ లీడర్లు!

Hawala Money: భాగ్యనగరంలో హవాలా డబ్బు, రూ1.24 కోట్లు పట్టుకున్న పోలీసులు!

Hawala Money: భాగ్యనగరంలో హవాలా డబ్బు, రూ1.24 కోట్లు పట్టుకున్న పోలీసులు!

కన్నతండ్రిని చంపిన కూతురు! 'దృశ్యం' చూసి ఎలా ఎస్కేప్ అవ్వాలో ప్లాన్, తల్లి నుంచి కూడా సపోర్ట్

కన్నతండ్రిని చంపిన కూతురు! 'దృశ్యం' చూసి ఎలా ఎస్కేప్ అవ్వాలో ప్లాన్, తల్లి నుంచి కూడా సపోర్ట్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

టాప్ స్టోరీస్

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే

KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ తొలి సభ కరీంనగర్ లోనేనా? కారణం ఏంటంటే

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

Hyderabad Traffic: నేడు ఈ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్! ఈ టైంలో ట్రాఫిక్ అడ్డంకులు, మరో దారి చూసుకోవాల్సిందే!

Hyderabad Traffic: నేడు ఈ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్! ఈ టైంలో ట్రాఫిక్ అడ్డంకులు, మరో దారి చూసుకోవాల్సిందే!

Prabhas: ప్రభాస్‌కు రోజా గుడ్ న్యూస్, కృష్ణంరాజు కోసం ప్రత్యేక కానుక

Prabhas: ప్రభాస్‌కు రోజా గుడ్ న్యూస్, కృష్ణంరాజు కోసం ప్రత్యేక కానుక