Maruti WagonR: 25 సంవత్సరాలుగా ఏలుతున్న మారుతి వ్యాగన్ఆర్ - 2024లో ఎన్ని అమ్ముడుపోయాయి?
Maruti WagonR Sales Report: మారుతి వ్యాగన్ఆర్ కారు 25 సంవత్సరాలుగా భారత మార్కెట్‌ను ఏలుతూనే ఉంది. 2024లో కూడా అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో రెండో స్థానంలో నిలిచింది.

Maruti WagonR Launched In 1999: మారుతి వ్యాగన్ఆర్ చాలా సంవత్సరాలుగా ప్రజల మొదటి ఆప్షన్‌గా ఉంది. ఈ కారు 25 సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో విడుదల అయింది. అప్పటి నుంచి ఈ కారుకు మార్కెట్లో డిమాండ్ తగ్గలేదు. మారుతి ఈ కారును 1999 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. గత సంవత్సరం 2024లో ఈ కారు అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే...
ఈసారి టాటా మోటార్స్‌కు చెందిన కారు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు అనే బిరుదును గెలుచుకుంది. 40 సంవత్సరాలలో టాటా మోటార్స్ కారు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం ఇదే మొదటిసారి. 2024 సంవత్సరంలో టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గత సంవత్సరం ఈ కారుకు సంబంధించి 2.02 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో 25 సంవత్సరాల తర్వాత కూడా మారుతి వ్యాగన్ఆర్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 2024 సంవత్సరంలో ఈ మారుతి కారుకు సంబంధించి 1.9 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
మీ డబ్బులకు వాల్యూ ఇస్తుంది...
మారుతి వ్యాగన్ఆర్ ప్రజాదరణకు కారణం ఈ కారు ధర. ఈ కారు మిడిల్ క్లాస్ ప్రజల బడ్జెట్ పరిధిలోకి వస్తుంది. అదే సమయంలో ఈ మోడల్‌ను డబ్బుకు తగిన విలువ అందించే కారు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ధరలో మారుతి వ్యాగన్ఆర్ మెరుగైన మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి వ్యాగన్ఆర్ ధర, మైలేజ్ రెండూ ప్రజలను ఆకర్షించడానికి సరిపోతాయి. ఢిల్లీలో మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5,54,500 నుంచి ప్రారంభమై దాని టాప్ వేరియంట్ ధర రూ. 7,20,500 వరకు ఉంటుంది.
మారుతి వ్యాగన్ఆర్ పవర్ ఎంత?
మారుతి వ్యాగన్ఆర్ మార్కెట్లో తొమ్మిద కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారులో కే12ఎన్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్‌తో ఈ కారు 6,000 ఆర్పీఎం వద్ద 66 కేడబ్ల్యూ శక్తిని, 4,400 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు సెమీ ఆటోమేటిక్ (AGS) ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.35 కిలోమీటర్ల మైలేజీని, ఏజీఎస్ ట్రాన్స్‌మిషన్‌తో 25.19 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొంది. ఈ కారు సీఎన్‌జీలో కూడా అందుబాటులో ఉంది. మారుతి వ్యాగన్ఆర్ 1.0 లీటర్ సీఎన్‌జీ వ్యాగన్ఆర్‌తో 33.47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
From thrilling launches to unforgettable milestones, 2024 was a ride to remember!
— Maruti Suzuki Arena (@MSArenaOfficial) December 31, 2024
Gear up for a year of new adventures and perfect matches with Maruti Suzuki Arena.
Here's to making 2025 even more amazing! 🎉 pic.twitter.com/UUShtWI7jE
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

