Electric SUVs To Launch in India: త్వరలో లాంచ్ కానున్న మారుతి, టాటా, మహీంద్రాల కొత్త ఎలక్ట్రిక్ SUV లు.. ఫీచర్లు, ధరలిలా
Electric SUVs in India: భారత్ లో మారుతి, టాటా, మహీంద్రా కంపెనీల నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV లు రాబోతున్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం, మంచి ఫీచర్స్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గత రెండు సంవత్సరాలలో డిమాండ్ వేగంగా పెరిగింది. 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో 1 లక్ష కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయాలు జరిగాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఈ గణాంకాలు భారత కస్టమర్లు ఇప్పుడు EVలపై నమ్మకం ఉంచుతున్నారని స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న ఛార్జింగ్ నెట్‌వర్క్‌లు, మెరుగైన బ్యాటరీ సాంకేతికత, ప్రభుత్వ EV విధానం ఈ మార్పును మరింత బలోపేతం చేశాయి. ప్రస్తుతం మారుతి సుజుకి (Maruti Suzuki), టాటా మోటార్స్, మహీంద్రా వంటి అన్ని ప్రధాన కంపెనీలు తమ నెక్స్ట్ జెన్ ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.. రాబోయే నెలల్లో మారుతి ఈ-విటారా, టాటా సియెరా EVతో పాటు మహీంద్రా XEV 9S భారత మార్కెట్లోకి రానున్నాయి.
మారుతి సుజుకి ఈ-విటారా
మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV ఈ-విటారాను భారతదేశంలో డిసెంబర్ 2న విడుదల చేయనుంది. ఈ-విటారా 2 బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో అందిస్తున్నారు. ఒకటి 49 kWh, మరొకటి 61 kWh. చిన్న వేరియంట్ నగరంలో నడిపేవారికి బెటర్ ఆప్షన్. అయితే 61 kWh మోడల్ సుదూర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో డ్యూయల్ మోటార్, AWD సిస్టమ్ ఎంపిక కూడా లభిస్తుంది. ఇది SUVకి మెరుగైన పనితీరును, స్థిరత్వాన్ని అందిస్తుంది. మారుతి ఈ-విటారా ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ ట్రావెల్ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ పరిధి టాటా నెక్సాన్ EV, MG ZS EV లతో పాటు హ్యుందాయ్ కోనా వంటి మోడళ్లతో సమానంగా లేదా వాటికంటే ఎక్కువ..
టాటా సియెరా EV
టాటా మోటార్స్ తన ఐకానిక్ SUV సియెరా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను 2025 చివరి నాటికి విడుదల చేయనుంది. దీనిని అధికారికంగా ఆవిష్కరణ నవంబర్ 25న లాంచ్ చేయనున్నారు. సియెరా EV హారియర్ EV వంటి పవర్‌ట్రెయిన్ సెటప్‌తో అందిస్తున్నారు. 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. 65 kWh వేరియంట్ 238 PS వెనుక మోటార్‌ను కలిగి ఉంటుంది. అయితే పెద్ద 75 kWh ప్యాక్‌తో 158 PS ఫ్రంట్ మోటార్ వస్తుంది. సియెరా EV దాదాపు 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందించగలదు. ఇది సుదూర ప్రయాణాలతో పాటు రోజువారీ ఉపయోగించవచ్చు. ఇందులో పనోరమిక్ గ్లాస్, కనెక్టెడ్ టైల్‌ల్యాంప్‌లు, శక్తివంతమైన బాడీ లైన్‌లు, ప్రీమియం క్యాబిన్ లేఅవుట్ ఉన్నాయి.
మహీంద్రా XEV 9S
మహీంద్రా తన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV XEV 9Sని భారతదేశంలో నవంబర్ 27న విడుదల చేయనుంది. ఈ SUV XEV 9e ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంది. సాంకేతికత, డిజైన్, ఫీచర్ల పరంగా కంపెనీ అత్యంత అధునాతన మోడల్‌గా చెబుతోంది. XEV 9S 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ 600+ km అద్భుతమైన రేంజ్ అందిస్తుంది. 7 సీటర్ లేఅవుట్ కలిగిన ఈ SUV కుటుంబానికి మంచి ఛాయిస్. దీని క్యాబిన్‌లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, పవర్ సీట్లు, స్లైడింగ్ సెకండ్ రో, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం స్పేస్ ఉంటాయి.






















