మారుతి సుజుకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, జూన్ 5న 100% ఇథనాల్‌తో నడిచే కారును విడుదల చేయనుంది.
Maruti Ethanol Car:పెట్రోల్‌కు కాలం చెల్లిందా? జూన్ 5న మారుతి "ఇథనాల్" విప్లవం...కిలోమీటర్‌కు రూ. 4లతో దూసుకెళ్లే మ్యాజిక్ కారు!
జూన్ 5న మారుతి సుజుకి దేశంలోనే తొలి పూర్తి స్థాయి ఇథనాల్ కారును విడుదల చేయనుంది. పెట్రోల్ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో నడిచే ఈ కారు భారత్ వాహన రంగంలోనే సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది.

- మారుతి సుజుకి 100% ఇథనాల్‌తో నడిచే కారును జూన్ 5న విడుదల చేస్తోంది.
- ఈ కారు పెట్రోల్, ఇథనాల్ రెండింటితోనూ నడుస్తుంది, కిలోమీటరుకు తక్కువ ఖర్చు.
- ఇథనాల్ వాడకం రైతులకు, పర్యావరణానికి లాభదాయకం, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.
- వ్యాగన్ ఆర్ లేదా ఫ్రాంక్స్ మోడళ్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కారును అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, దిగుమతి ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా మారుతి ఈ అడుగు వేస్తోంది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఈ టెక్నాలజీపై పదే పదే మాట్లాడుతున్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో విజయవంతమైన ఈ మోడల్‌ను ఇప్పుడు భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతి సుజుకి తీర్చిదిద్దింది.
పెట్రోల్, ఇథనాల్ రెండింటినీ వాడుకోవచ్చు
సాధారణంగా మనం వాడే పెట్రోల్‌లో కొంత శాతం ఇథనాల్ కలుపుతారు. కానీ మారుతి తీసుకురాబోయే ఈ కొత్త కారు E100 గ్రేడ్ ఇథనాల్‌తో నడుస్తుంది. అంటే దీనికి పెట్రోల్, డీజిల్ సీఎన్జీ లేదా విద్యుత్ ఏదీ అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్. ఈ కారులోని 1.2 లీటర్ ఇథనాల్, పెట్రోల్ రెండింటినీ స్వీకరించగలదు. మీరు ఇథనాల్ దొరకని చోట పెట్రోల్‌తో కూడా నడుపుకోవచ్చు. కానీ వందశాతం ఇథనాల్ వాడినప్పుడు దీని సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది.
Also Read: నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!
లీటర్‌కు 3.5 రూపాయలే...మైలేజీ ఎంతంటే?
ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి, ఈ పరిస్థితుల్లో ఇథనాల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారు ద్వారా కిలోమీటర్ ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం 3.5 నుంచి నాలుగు రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా. వంద శాతం ఇథనాల్ పై నడిచినప్పుడు ఈ కారు లీటర్ 15 నుంచి 18 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని సమాచారం. పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే సగానికిపైగా ఆదా అవుతుంది.
Also Read: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?
వ్యాగన్‌ఆర్ లేదా ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఏ మోడల్‌ను ముందుగా లాంచ్ చేస్తుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం మారుతి వ్యాగన్ ఆర్ లేదా ఫ్రాంక్స్‌లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో మారుతి సంస్థ ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది.
మారుతి ఇథనాల్ కారు ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం
చూడటానికి ఈ కారు ప్రస్తుత మోడల్‌లాగనే ఉంటుంది. కానీ లోపల ఇంజిన్ వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. కారులో ఎంత ఇథనాల్ ఉంది. అది ఎంత సమర్థంగా పని చేస్తోంది. అని తెలుసుకోవడానికి ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. ఇథనాల్‌్ వల్ల తుప్పు పట్టుండా ఉండేలా ప్రత్యేక పైపులు, ట్యాంక్ డిజైన్ చేశారు. టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి అన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.
రైతులకు, పర్యావరణానికి ఎలా లాభం?
ఈ ఇథనాల్ కారు కేవలం వాహనదారులకే కాదు, దేశ రైతాంగానికి కూడా గొప్ప వరం. ఇథనాల్ ప్రధానంగా చెరకు , మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇథనాల్ వాడకం పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర దక్కడమే కాకుండా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పుంజుకుంటాయి. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.
Also Read: వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
శిలాజ ఇంధన వాడకం తగ్గడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. క్లీనర్ ఎనర్జీ దిశగా భారత్ వేస్తున్న అతి పెద్ద అడుగ్గా దీనిని చెప్పవచ్చు.
Frequently Asked Questions
మారుతి సుజుకి ఏ రోజున 100% ఇథనాల్‌తో నడిచే కారును విడుదల చేయనుంది?
ఈ కొత్త ఇథనాల్ కారు ఏ ఇంధనాలతో పనిచేస్తుంది?
ఈ కారు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 100% ఇథనాల్‌తో పాటు పెట్రోల్ కూడా ఉపయోగించుకోగలదు.
ఇథనాల్ కారు నడపడానికి అయ్యే ఖర్చు ఎంత?
ఇథనాల్ వాడకం వల్ల కిలోమీటర్ ప్రయాణానికి అయ్యే ఖర్చు 3.5 నుండి 4 రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా. పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే ఇది సగానికిపైగా ఆదా అవుతుంది.
ఈ ఇథనాల్ కారు ఏ మోడల్స్‌లో రానుంది?
మారుతి వ్యాగన్ ఆర్ లేదా ఫ్రాంక్స్ మోడల్స్‌లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది. గతంలో ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించారు.
ఇథనాల్ వాడకం వల్ల రైతులకు, పర్యావరణానికి ఎలాంటి లాభాలున్నాయి?
ఇథనాల్ వాడకం పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పుంజుకుంటాయి. శిలాజ ఇంధనాల వాడకం తగ్గడం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి, వాతావరణం మెరుగుపడుతుంది.
ట్రెండింగ్ వార్తలు





















