అన్వేషించండి

త్వరలో పెరగనున్న Maruti Alto K10 ధర.. చీపెస్ట్ కారు ఇక కాస్ట్‌లీ- ధర, ఫీచర్లు చూశారా

Alto K10 Price Hike: మారుతి ఆల్టో K10 జూన్ నుంచి ధర పెరగనుంది. ఈ మేరకు కంపెనీ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. ఆల్టో కే10 కారు 1.0-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి కార్ల ధరలు జూన్ 2026 నుండి పెరుగుతాయి.
  • మారుతి ఆల్టో కె10 బేస్ మోడల్ ధర రూ. 30,000 వరకు పెరగవచ్చు.
  • పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, ద్రవ్యోల్బణమే ధరల పెంపునకు కారణాలు.
  • ధరలు పెరిగితే, రెనాల్ట్ క్విడ్ వంటి కార్లకు పోటీ పెరగవచ్చు.

భారత ఆటో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే బడ్జెట్ కార్లలో ఒకటైన మారుతి ఆల్టో (Maruti Alto) త్వరలో మరింత ఖరీదు కానుంది. ఒకవేళ మీరు తక్కువ ధరలో కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కారును ఈ వారంలోనే కొనేయండి. లేకపోతే జూన్ 2026 నుండి తమ కార్ల ధరలు పెరుగుతాయని మారుతి సుజుకి కంపెనీ ఇదివరకే ప్రకటించింది. కంపెనీ వేర్వేరు మోడళ్లు,  వేరియంట్ల ఆధారంగా ధరలను పెంచుతోంది. కార్ల ధర ఈ పెరుగుదల 30 వేల రూపాయల వరకు ఉండనుంది. దీని ప్రభావం కంపెనీ అత్యంత చౌకైన కార్లలో ఒకటైన ఆల్టో కె10 (Alto K10) పై కూడా ఉంటుంది. 

ప్రస్తుతం మారుతి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు 3.70 లక్షల రూపాయలుగా ఉంది. కంపెనీ బేస్ మోడల్‌పై రూ. 30 వేలు పెంచితే, దీని ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ విలువ దాదాపు 4 లక్షలు కావచ్చు. ఇప్పటివరకు దేశంలోనే అత్యంత చౌకైన, బడ్జెట్ ఫ్రెండ్లీ కార్‌గా భావించేవారు. ఇప్పుడు ఎక్కువ చెల్లించి ఈ కారు కొనాల్సి రావచ్చు. అయితే ప్రతి వేరియంట్‌పై ఒకేలాంటి పెరుగుదల ఉండదని మారుతి కంపెనీ స్పష్టం చేసింది. కొన్ని మోడళ్లపై తక్కువ పెరిగితే, మరికొన్నింటిపై ఎక్కువగా పెరుగుదల గమనిస్తారు. 

Also Read: Best CNG Cars: ధరలు పెరగకముందే ఈ CNG కార్లు కొనేయండి.. పెట్రోల్ ఖర్చుల నుంచి బిగ్ రిలీఫ్

ఆల్టో కే10 ధర ఎంత ఉండవచ్చు?
మారుతి ఆల్టో కె10 యొక్క వేర్వేరు వేరియంట్ల కొత్త ధరల అంచనా వివరాలు వెల్లడయ్యాయి. ఉదాహరణకు, మారుతి ఆల్టో కె10 ఎస్‌టిడి (O) ధర సుమారు 3.69 లక్షల నుండి పెరిగి దాదాపు 3.99 లక్షలు కావచ్చు. అదే విధంగా ఎల్‌ఎక్స్‌ఐ (LXi), విఎక్స్‌ఐ (VXi) వంటి మోడళ్లు 4.30 లక్షల రూపాయల నుంచి రూ. 5.60 లక్షల వరకు చేరుకోవచ్చు. సీఎన్‌జి (CNG) వేరియంట్‌పై సైతం ధరలు పెరగనున్నాయి. 

ధరలు పెంచడానికి పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, ద్రవ్యోల్బణమే కారణమని మారుతి కంపెనీ పేర్కొంది. అంటే కార్ తయారీలో ఉపయోగించే స్టీల్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, రవాణా వంటి ఖర్చులు ఎప్పటికప్పుడూ పెరుగుతున్నాయి. ఈ కారణంగానే మారుతి కంపెనీ ధరలను పెంచాలని నిర్ణయించింది. గత కొంతకాలంగా ఇతర ఆటోమొబైల్ కంపెనీలు సైతం తమ కార్ల ధరలను పెంచేశాయి.

ఆల్టో కె10 మైలేజీ, ఫీచర్లు ఇవే.. 
మారుతి ఆల్టో కె10ను ముఖ్యంగా దాని తక్కువ ధర, మెరుగైన మైలేజీ, ఈజీ మెయింటెనెన్స్ కారణంగా ఇష్టపడతారు. ఈ కార్‌లో 1.0 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది మంచి మైలేజీ ఇచ్చి మీ ఖర్చులు తగ్గిస్తుంది. దీని మాన్యువల్ వేరియంట్ లీటరుకు సుమారు 24.39 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ దాదాపు 24.90 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తున్నాయి.  సిఎన్‌జి మోడల్ కిలోగ్రాముకు దాదాపు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజీతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. 

Read Also: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి

ఫీచర్ల విషయానికి వస్తే, మారుతి ఆల్టో కె10లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ పవర్ విండోస్, కీ‌లెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు వస్తాయి. చిన్న కుటుంబాలకు, సిటీలో రోజువారీ ఆఫీసు జర్నీ కోసం ఈ కార్ చాలా పాపులర్‌. దీని కాంపాక్ట్ సైజు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కారణంగా మొదటిసారి కార్ కొనాలనుకునే వారు ఆల్టో కే10 ని ఎక్కువగా ఇష్టపడతారు.

ఆల్టో కె10 ధరలు పెరగడం వల్ల మార్కెట్లో దానికి గట్టి పోటీగా ఉన్న రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) వంటి కార్లకు ఇది కలిసి రావచ్చు. ఒకవేళ రెనాల్ట్ క్విడ్ తన ధరలను ఉంచితే, బడ్జెట్ కస్టమర్లు ఆ వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్త బడ్జెట్ కార్ల ధరలు రూ. 4 లక్షల మార్కును దాటుతుండటంతో, మధ్యతరగతి, మొదటిసారి కార్లు కొనే కస్టమర్లు మారుతి ట్రూ వ్యాల్యూ లేదా కార్స్24 (Cars24) వంటి ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు ఎక్కువ ఆసక్తి చూపనున్నారు. 

Frequently Asked Questions

మారుతి ఆల్టో కె10 ధరలు ఎప్పటి నుంచి పెరుగుతాయి?

మారుతి సుజుకి కంపెనీ తమ కార్ల ధరలను జూన్ 2026 నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరుగుదల 30 వేల రూపాయల వరకు ఉండవచ్చు.

మారుతి ఆల్టో కె10 ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, ద్రవ్యోల్బణమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని మారుతి కంపెనీ పేర్కొంది. తయారీ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచాలని నిర్ణయించింది.

మారుతి ఆల్టో కె10 ఏ వేరియంట్ పై ధర పెరుగుతుంది?

మారుతి ఆల్టో కె10 లోని అన్ని వేరియంట్లపై ధరలు పెరుగుతాయి. అయితే, ప్రతి వేరియంట్ పై ఒకేలాంటి పెరుగుదల ఉండదని, కొన్ని మోడళ్లపై తక్కువ, మరికొన్నింటిపై ఎక్కువగా పెరుగుదల ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

మారుతి ఆల్టో కె10 మైలేజీ ఎంత?

మారుతి ఆల్టో కె10 మాన్యువల్ వేరియంట్ లీటరుకు సుమారు 24.39 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ దాదాపు 24.90 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. CNG మోడల్ కిలోగ్రాముకు దాదాపు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget