New Maruti Suzuki Dzire: కొత్త డిజైర్‌లో భారీ మార్పులు చేయనున్న మారుతి - కారునే మార్చేశారు కదయ్యా!
Maruti Suzuki Dzire 2024 Changes: కొత్త మారుతి సుజుకి డిజైర్‌లో కంపెనీ చాలా మార్పులు చేసింది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్, టచ్ స్క్రీన్, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
Maruti Suzuki Dzire 2024: మారుతి సుజుకి ఈ నెల 11వ తేదీన కొత్త డిజైర్‌ను విడుదల చేయనుంది. ఈ కారుకు సంబంధించిన కొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం. కొత్త తరం డిజైర్ చాలా కొత్తగా ఉండనుంది. ఈ నాలుగో తరం కొత్త డిజైర్ అనేక కొత్త మార్పులను పొందుతోంది.
1. 360 డిగ్రీ కెమెరా
కొత్త డిజైర్‌లో 360 డిగ్రీ కెమెరా ఉంది, ఇది మునుపటి వెర్షన్‌లో లేదు. మరే ఇతర కాంపాక్ట్ సెడాన్‌లో లేదా పెద్ద సెడాన్‌లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో లేదు. 360 డిగ్రీల కెమెరా HD డిస్‌ప్లే, మల్టీపుల్ వ్యూయింగ్ యాంగిల్స్‌ను కలిగి ఉంది.
2. సన్‌రూఫ్
కొత్త డిజైర్‌లో సన్‌రూఫ్ అందించారు. ఇది మునుపటి డిజైర్‌లో కూడా అందుబాటులో లేదు. సింగిల్ పేన్ యూనిట్‌తో వస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం మరే ఇతర కాంపాక్ట్ సెడాన్‌లో కూడా అందుబాటులో లేదు. మొదటిసారి ఇందులోనే అందిస్తున్నారు.
3. తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్
కొత్త డిజైర్ 9 అంగుళాల సైజులో ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో పాటు రిమోట్ ఫంక్షన్‌లతో కనెక్టెడ్ కార్ టెక్, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, మరిన్ని ఇతర ఫీచర్లతో వస్తుంది.
Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!
4. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
కొత్త డిజైర్‌లో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించనున్నారు. ఇదే ఫీచర్‌ను స్విఫ్ట్‌లో కూడా అందించనున్నారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఈఎస్‌పీ, ఐసోఫిక్స్ మరిన్ని బెస్ట్ సేఫ్టీ ఫీచర్లను పొందుతుంది.
5. జెడ్ సిరీస్ ఇంజిన్
కొత్త డిజైర్ ఇప్పుడు 3 సిలిండర్ల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో మార్కెట్లోకి రానుంది. ఇది 82 బీహెచ్‌పీని జనరేట్ చేస్తుంది. మారుతి సుజుకి కొత్త డిజైర్ ఇప్పుడు ఆటోమేటిక్ వెర్షన్‌లో 25.71 కిలోమీటర్లు, 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ 24.79 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.
మారుతి సుజుకి కొత్త డిజైర్ క్రాష్ టెస్ట్‌ల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం విశేషం. మారుతి సుజుకి ఇప్పటి వరకు లాంచ్ చేసిన అన్ని కార్లలో ఒక్కటి కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందలేదు. ఆ ఫీట్ సాధించిన మొదటి కారు ఇదే. క్రాష్ టెస్ట్‌లో పాస్ అయిన మొదటి మారుతి కారుగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. కొత్త మారుతి డిజైర్ ఏకంగా గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ రేటింగ్‌ను పొందడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఇండియా ఎన్‌సీఏపీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కంటే గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మంచి రేటింగ్ సాధించడం అనేది చాలా కష్టం. ఇంతకుముందు కొన్ని మారుతి కార్లు క్రాష్ టెస్ట్‌లలో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను పొందాయి కానీ ఫైవ్ స్టార వరకు వెళ్లలేదు. అడల్ట్ ఆక్యుపెంట్ సెక్యూరిటీలో మారుతి డిజైర్ కొత్త మోడల్ ఐదు స్టార్లను పొందింది. ఇది చైల్డ్ సెక్యూరిటీ రేటింగ్‌లో నాలుగు స్టార్ల రేటింగ్‌ను పొందింది.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!